హైదరాబాద్‌ జోన్‌: పోలీసుల్లో ఏసీబీ దాడుల టెన్షన్‌! | ACB Arrest Bribe Taking Police In Hyderabad Zone, More Details Inside | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ జోన్‌: పోలీసుల్లో ఏసీబీ దాడుల టెన్షన్‌!

Jun 22 2024 11:12 AM | Updated on Jun 22 2024 11:25 AM

ACB Arrest Bribe Taking Police In Hyderabad Zone

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పోలీసు వర్గాల్లో ఏసీబీ దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్‌ జోన్‌ పరిధిలో రెండు నెలల కాలంలోనే ఏసీబీ దాడుల్లో పదుల సంఖ్యలో ఏసీబీ కేసులు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎన్నడూ లేనంతగా పోలీసు అధికారులు ఏసీబీకి చిక్కుతున్నారు.

వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ జోన్‌ పరిధిలో ఏసీబీ దాడుల్లో పోలీసులు వరుసగా పట్టుబడుతున్నారు. భూ వివాదాల సెటిల్‌మెంట్‌, ఫైనాన్స్‌ కేసుల వ్యవహారాల్లో లంచాలు తీసుకుంటూ ఓ అధికారి అరెస్ట్‌ అయ్యాడు. అలాగే, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వర రావు ఏసీబీ చిక్కారు. సీసీఎస్‌ సుధాకర్‌ గౌడ్‌ లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

ఇక, కుషాయిగూడలో మూడు లక్షలు లంచం తీసుకుంటూ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్ వీరస్వామి, సబ్ ఇన్‌స్పెక్టర్ షఫీ, మధ్యవర్తి ఉపేందర్‌లు పట్టుబడ్డారు.తాజాగా సూరారం ఎస్‌ఐ ఆకుల వెంకటేశం లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు తీరు చర్చనీయాంశంగా మారింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement