
హైదరాబాద్: సైదాబాద్ జువైనల్ హోం నుంచి 10 మంది బాలలు పరారయ్యారు. వెంటపడి నలుగురు బాలలను జువైనల్ సిబ్బంది అదుపులోకి తీసుకుంది. మరో ఆరుగురు బాలల తప్పించుకున్నట్లు తెలుస్తోంది. తప్పించుకున్న బాలల కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. కాగా తప్పించుకున్న వారంతా ఆపరేషన్ ముస్కాన్‌లో పోలీసులు రక్షించిన బాల కార్మికులని తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ ఘటనపై పోలీసులకు సైదాబాద్ బాలుర గృహం ఫిర్యాదు చేయలేదని సమాచారం.