Fish Price Today in Hyderabad - Sakshi
Sakshi News home page

మృగశిర ఎఫెక్ట్‌.. కొర్రమీను@ 650

Jun 9 2023 8:44 AM | Updated on Jun 9 2023 3:43 PM

Fish Price Today in Hyderabad - Sakshi

మృగశిర కార్తెను పురస్కరించుకుని చేపలకు భారీ డిమాండ్‌ ఏర్పడింది.

హైదరాబాద్: మృగశిర కార్తెను పురస్కరించుకుని చేపలకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. గురువారం నగరంలోని చేపల మార్కెట్లు వినియోగదారులతో కిక్కిరిశాయి. గ్రేటర్‌ వ్యాప్తంగా సుమారు 3 లక్షల కిలోల చేపల విక్రయాలు జరిగినట్లు మార్కెట్‌ వర్గాల అంచనా.

మృగశిర కార్తె ఎఫెక్ట్‌తో కొర్రమీను ధరలు విపరీతంగా పెరిగాయి. సాధారణ రోజుల్లో ఈ చేపలు కిలోకు రూ.320 పలుకుతుండగా.. ప్రస్తుతం రూ.500 నుంచి రూ. 650 వరకు విక్రయించారు. బొచ్చ, రవ్వు చేపలను కిలో రూ.120 నుంచి రూ. 150కి, పాంప్లేట్‌ రూ. 90–120 విక్రయించారు. 

Advertisement
 
Advertisement
Advertisement