తమిళసినిమా: నటి త్రిష. ఈ పేరే ఒక సంచలనం . ఇప్పుడు నిత్యం వార్తల్లో ఉంటున్న నటి ఈ బ్యూటీ. కొన్ని విషయాల్లో తీవ్ర విమర్శలను ఎదుర్కోవడం పరిపాటిగా మారింది. ఇటీవల నటుడు అజిత్ అంతర్జాతీయ కారు రేసులో పాల్గొనడానికి లండన్ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ రేస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. తాన సినీ రంగ మిత్రుడు అజిత్‌కు విజయం సాధించి రమ్మంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఇద్దరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అంతవరకు బాగానే ఉంది.ఆ కార్యక్రమానికి నటి త్రిష రావడం, అదీ ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ పక్కన నిలబడం చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటన గురించి పలువురు పలు రకాలుగా మాట్లాడుకుంటున్నారు. అలా సీనియర్ నటి అంబిక కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆమె ఇటీవల ఒక యూట్యూబ్ ఛానళ్ కు ఇచ్చిన భేటీలో నటి త్రిష గురించి జరుగుతున్న చర్చపై స్పందిస్తూ. ‘‘ ఇద్దరి మధ్య స్నేహం అనేది చాలా ముఖ్యం. అది అవసరం కూడా.. అదే విధంగా నటుడు విజయ్, త్రిష లో మధ్య ఫ్రెండ్షిప్ గురించి అందరికీ తెలిసిందే. అయితే విజయ్ ఇప్పుడు ముఖ్యమంత్రి అనే గౌరవప్రదమైన పదవిలో ఉన్నారు. అలాంటి ఆయన సంకటం పడే విధంగా మన ప్రవర్తన ఉండకూడదు. త్రిష స్థానంలో గనుక నేను ఉండి ఉంటే కచ్చితంగా దూరం పాటించి ఉండేదాన్ని ‘‘ అని అంబిక పేర్కొన్నారు. ఈమె భేటీ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.


