తమిళసినిమా: సెలక్ట్ చిత్రాల్లో నటిస్తున్న నటుడు అర్జున్ దాస్. ఈయన తాజాగా కొత్త చిత్రంలో నటించడానికి సిద్ధం అయ్యారు. సిల్వర్ టీ స్టూడియోస్ పతాకంపై విజయ్.ఎంపీ నిర్మిస్తున్న మొదటి చిత్రంలో అర్జున్ దాస్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి పాప్ ఎంటర్‌టైన్‌మైంట్ సంస్థ సహ ,భాగస్వామ్యం వహిస్తున్నారు. ఇందులో ఆయనకు జంటగా ప్రీతి పగడాల నాయకిగా పరిచయం అవుతున్నారు. రంజిత్ జయక్కొడి కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రంలో దర్శకుడు కేఎస్.రవికుమార్, సరవణన్, యోగి బాబు, బాలా శరవణన్, అశ్విని నంబియార్, మోనా పెట్రో, జగన్ కృష్ణన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించనున్నారు. కాగా ఈ చిత్రం షూటింగ్ బుధవారం చైన్నెలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇది రొమాంటిక్ లవ్ , ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. చిత్రంలో కుటుంబ అనుబంధాలు వంటి పలు ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకుంటారని చెప్పారు. మంచి వైవిధ్య భరితమైన కథా చిత్రాలను నిర్మించాలన్న ఉద్దేశంతో సిల్వర్ టీ సంస్థను ప్రారంభించినట్లు నిర్మాత విజయ్ ఎం.పి పేర్కొన్నారు. మంచి కథా చిత్రాలను వరుసగా నిర్మించనున్నట్లు చెప్పారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను వరుసగా వెల్లడించనున్నట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నారు.


