ఏటీఎం మిషన్‌ చోరీ కేసులో ముగ్గురి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

ఏటీఎం మిషన్‌ చోరీ కేసులో ముగ్గురి అరెస్టు

Sep 18 2026 1:09 AM | Updated on Sep 18 2026 1:09 AM

– రూ.4 లక్షలు స్వాధీనం

తిరువళ్లూరు: వెళ్లవేడు సమీపంలో ఏటీఎం మిషన్‌ చోరీ వ్యవహరంలో ముగ్గరిని అరెస్టు చేసిన పోలీసులు వారిని నుంచి నగదును సైతం రికవరీ చేశారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా పూందమల్లి సమీపంలోని గూడపాక్కం మేట్టుకండ్రిగ వద్ద వున్న ఏటీఎం మిషన్‌ను గత ఐదున గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. దీంతో మిషన్‌తో పాటూ 12 లక్షల నగదు సైతం మాయమైంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపిన క్రమంలో వెళ్లవేడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల సమీపంలోని వున్న సీసీటీవీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. దర్యాప్తులో ఏటీఎం మిషన్‌, నగదును ఎత్తుకెళ్లినట్టు పశ్చిమ బెంగాల్‌కు చెందిన సమీర్‌(36), రసూల్‌(30), మాసురన్‌(53) తదితర ముగ్గురిని అరెస్టు చేశారు. అనంతరం వీరి వద్ద చేపట్టిన విచారణలో వీరు ప్లాస్టిక్‌ వస్తువులను సేకరించి వాటిని విక్రయించే పనులు చేస్తున్నట్టు నిర్ధారించారు. ప్లాస్టిక్‌ వస్తువులను సేకరించే సమయంలో చోరీకి ప్లాన్‌ వేసి ఏటీఎం మిషన్‌, నగదు చోరీకి పాల్పడినట్టు నిర్ధారించారు. అంతనరం ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement