పళ్లిపట్టులో కుండపోత వర్షం | - | Sakshi
Sakshi News home page

పళ్లిపట్టులో కుండపోత వర్షం

Sep 18 2026 1:09 AM | Updated on Sep 18 2026 1:09 AM

పళ్ళిపట్టు: పళ్లిపట్టులో గురువారం సాయంత్రం కుండపోత వానతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఫలితంగా చిత్తూరు రోడ్డులో వరదను తలపించేలా వర్షపు నీరు నిల్వ చేరడంతో వాహన చోదకులు ఇబ్బందులు చెందారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా గత ఏడాది సాదారణ వర్షపాతం నమోదు కావడంతో నదులు, చెరువులు, వాగులు వంకలు ఎండి నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. పైగా ఈ ఏడాది వేసవి ఎండల తీవ్రతతో భూగర్భజలాలు అడుగంటాయి. సెప్టెంబర్‌ నెల కావస్తున్నా ఎండల తీవ్రత తగ్గకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు చెందుతున్నారు. ఎప్పుడెప్పుడు వర్షం వస్తుందా అని ప్రజల ఎదుచుచూపుల నేపధ్యంలో గురువారం సాయంత్రం ఆకాశం మేఘామృతం మారి గంటపాటు భారీ వర్షం కుమ్మరించింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి, ఎండల తీవ్రతతో అల్లాడిన జనానికి ఈ వర్షం కాస్తా ఉపశమనం కల్పిగించింది. ఆర్కేపేట, తిరుత్తణి పరిసర ప్రాంతాల్లో సైతం గురువారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది.

చిత్తూరు రోడ్డులో వర్షపునీరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement