అత్త, మామకు కత్తిపోట్లు | - | Sakshi
Sakshi News home page

అత్త, మామకు కత్తిపోట్లు

Sep 18 2026 1:09 AM | Updated on Sep 18 2026 1:09 AM

అల్లుడి అరెస్టు

పళ్ళిపట్టు: భార్య కాపురానికి రాలేదనే కోపంతో దాడి చేయడంతో అడ్డుకున్న అత్త, మామను కత్తితో గాయపరిచిన అల్లుడిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వివరాలు.. ఆర్కేపేట సమీపంలోని పద్మాపురం గ్రామానికి చెందిన రవి శాంతి దంపతుల కుమార్తె రేఖ. చెంగల్పట్టుకు చెందిన రాజేష్‌ అనే వ్యక్తితో 14 ఏళ్ల కిందట వివాహం చేసుకుని ముగ్గురు పిల్లలు ఉన్నారు. రాజేష్‌ రేఖ దంపతులు వారి పిల్లలతో షోళింగర్‌లో అద్దె ఇంట్లో నివాస ముంటున్నారు. ఈక్రమంలో నెల కిందట దపంతుల మద్య తగాదా చోటు చేసుకోవడంతో భర్తతో అలిగిన రేఖ పద్మాపురంలోని పుట్టింట్లో ఉంటున్నారు. ఈక్రమంలో మూడు రోజుల కిందట భార్యను కాపురానికి రావాలని పిలిచేందుకు వెళ్లిన రాజేష్‌ భార్యతో గొడవ పడి దాడిచేసే సమయంలో అడ్డుకున్న అత్త మామలను కూరగాయాలు కోసే కత్తితో తలపై దాడి చేశాడు. వారికి తీవ్ర గాయాలు కావడంతో రాజేష్‌ పరారయ్యాడు. గాయాలైన రవి శాంతి దంపతులకు స్థానికులు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి చికిత్స పొందుతున్నారు. ఆర్కేపేట పోలీసులు కేసు నమోదు చేసి పరారిలో వున్న రాజేష్‌ను బుధవారం అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement