తమిళసినిమా: చలన చిత్రానికి ఆద్యుడు ఆల్వా ఎడిసన్ కీర్తిని పరస్కరించుకుని ఎడిషన్ అవార్డు పేరుతో సెల్వ కుమార్ గత 17 ఏళ్లుగా చిత్ర రంగంలోని ప్రముఖులు సేవలను ప్రశంసించే విధంగా, యువ కళాకారుల ప్రతిభన గుర్తించే విధంగా పురస్కార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. కాగా 2025 ఏడాదికి గాను ఎడిషన్ అవార్డుల ప్రదానోత్సవం వేడుక ఇటీవల చైన్నె, నందంబాక్కం లోని ట్రేడ్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో మలేషియా సహాయ మంత్రి రామరాజ్‌తో పాటు రష్యా, మలేషియా, సింగపూర్, స్పెయిన్ దేశాల రాయబారులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అదేవిధంగా పలువురు సినీ ప్రముఖులు విచ్చేసిన ఈ వేదికపై దర్శకుడు మారి సెల్వరాజ్, నటుడు దవ్ రియోరాజ్, గాయని సైంథవి మొదలగు పలువురు నటీనటులు సాంకేతిక నిపుణులు అవార్డులను అందుకున్నారు. ముఖ్యంగా ఈ వేదికపై వచ్చే ఏడాది నుంచి నటుడు విజయ్ పేరుతో ఎడిసన్ అవార్డు ప్రవేశ పెట్టనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. అదేవిధంగా ఎడిసన్ మిలియనరి క్లబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎడిషన్ అవార్డులను ప్రపంచ దేశాలకు విస్తరించే విధంగా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్మికులు, వ్యాపారవేత్తలను ఒకే వేదికపైకి తీసుకు రావడమే ఈ క్లబ్ ప్రధాన ఉద్దేశం అని నిర్వాహకుడు సెల్వకుమార్ పేర్కొన్నారు.
సర్ధార్ – 2 చిత్ర
స్పెషల్ పోస్టర్ విడుదల


