అత్యాచార కేసు నిందితుడికి 15 ఏళ్ల జైలు | - | Sakshi
Sakshi News home page

అత్యాచార కేసు నిందితుడికి 15 ఏళ్ల జైలు

May 26 2026 11:59 PM | Updated on May 26 2026 11:59 PM

తిరువళ్లూరు: ఒంటరిగా వున్న మైనర్‌ బాలికపై అత్యాచార యత్నం చేసిన నిందితుడికి 15 ఏళ్ల జైలు శిక్షతో పాటూ రూ. 15 వేలు జరిమానా విధిస్తూ తిరువళ్లూరు పోక్సో కోర్టు న్యామూర్తి ఉమామహేశ్వరి తీర్పును వెలువరించారు. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి తాలుకా మేట్టుకుప్పం గారమానికి చెందిన దశరధన్‌ కుమారుడు జగన్నాథన్‌(35). ఇతను 2023 మే 7న తన ఇంటికి సమీపంలో ఒంటరిగా వున్న 14 ఏళ్ల బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై బాధిత బాలిక తల్లిదండ్రులు గుమ్మిడిపూండి మహిళ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అప్పట్లో జగన్నాథన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యాడు. కాగా ఈ కేసు విచారణ తిరువళ్లూరు పోక్సో కోర్టులో సాగింది. విచారణ పూర్తయిన క్రమంలో న్యాయమూర్తి ఉమామహేశ్వరి తీర్పును వెలువరించారు. నిందితుడు బాలికపై అత్యాచార యత్నం చేయడంతో పాటూ బెదిరింపులకు దిగినట్టు నేరం రుజువు కావడంతో 15 ఏళ్ల జైలు శిక్షతో పాటూ విధిస్తూ కోర్టు తీర్పును వెలువరించింది. బాధిత బాలికకూ ప్రభుత్వం రూ.లక్ష పరిహారంగా ఇవ్వాలని తీర్పును వెలువరించారు. శిక్షపడ్డ అనంతరం నిందితుడ్ని పుళల్‌ జైలుకు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement