ఆర్కేపేటలో గాలివాన బీభత్సం | - | Sakshi
Sakshi News home page

ఆర్కేపేటలో గాలివాన బీభత్సం

May 26 2026 11:59 PM | Updated on May 26 2026 11:59 PM

రావిచెట్టు పడి కూలిన ఇల్లు

పళ్లిపట్టు: ఆర్కేపేటలో మంగళవారం గాలివాన బీభత్సం సృష్టించింది. ఇంటిపై రావిచెట్టు కూలడంతో ఇల్లు ధ్వంసమైంది. ఆర్కెపేట ప్రాంతంలో గంటపాటు పెనుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ముందుజాగ్రత్త చర్యగా విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. రాఘవనాయుడు కుప్పం అరుంధతియార్‌ కాలనీలో కూలీ పరశురామన్‌ ఇంటిపై రావిచెట్టు కూలింది. అయితే ఇంట్లో ఉన్నవారందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఇంట్లో చిక్కుకున్న వారిని స్థానికులు సురక్షితంగా రక్షించారు. ఆర్కేపేట నార్త్‌ యూనియన్‌ డీఎంకే కార్యదర్శి సి.ఎన్‌.షణ్ముగం, ఇల్లు కూలి నష్టపోయిన కుటుంబాలను పరామర్శించారు. అదేవిధంగా, పలు ప్రాంతాల్లో చెట్లు కూలడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పల్లిపట్టు యూనియన్‌న్‌లో పెనుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. తిరుత్తణిలో గాలివానకు గంటసేపు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. కనకమ్మసత్రంలో విద్యుత్‌ స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement