స్కూల్‌ బస్సుల తనిఖీ | - | Sakshi
Sakshi News home page

స్కూల్‌ బస్సుల తనిఖీ

May 26 2026 11:59 PM | Updated on May 26 2026 11:59 PM

–32 వాహనాల ఫిట్‌నెస్‌ రద్దు

తిరుత్తణి: తిరుత్తణిలో ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులను తనిఖీ చేశారు. విద్యార్థుల భద్రతకు సంబంధించిన లోపాలు ఉన్నట్లు గుర్తించి 32 వాహనాల ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లను తాత్కాలికంగా రద్దు చేశారు. వేసవి సెలవులు ముగిసిన తర్వాత జూన్‌ 4వ తేదీన పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రైవేట్‌ పాఠశాలల వాహనాల భద్రతను నిర్ధారించుకోవడానికి వాటిని తనిఖీ చేసి, ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్లను జారీ చేస్తున్నారు. తిరుత్తణిలోని ఒక ప్రైవేట్‌ కళాశాల ప్రాంగణంలో 43 పాఠశాలలకు చెందిన 275 వాహనాలను తనిఖీ చేశారు. తిరుత్తణి ఎంవీఐ రాజశేఖర్‌, ఆర్డీఓ కనిమొళి, ఏఎస్పీ శుభం దిమాన్‌, జిల్లా విద్యాధికారి లింగేశ్వరన్‌, తిరువళ్లూరు ఎంవీఐ మురుగేశన్‌ సమక్షంలో మంగళవారం పాఠశాల వాహనాలను పరిశీలించారు. 202 వాహనాలను తనిఖీ చేయగా, 170 వాహనాలకు ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్లు జారీ చేశారు. 32 పాఠశాల వాహనాల ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లను తాత్కాలికంగా రద్దు చేసి, పునః తనిఖీకి ఆదేశించారు. అంతకుముందు తిరుత్తణి అగ్నిమాపకశాఖ అధికారి సంపత్‌ నేతత్వంలోని సిబ్బంది, ప్రైవేట్‌ పాఠశాల వాహనాల డ్రైవర్లకు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement