బస్టాండ్‌లో ఆక్రమణలు తొలగింపు | - | Sakshi
Sakshi News home page

బస్టాండ్‌లో ఆక్రమణలు తొలగింపు

May 26 2026 11:59 PM | Updated on May 26 2026 11:59 PM

వేలూరు: వేలూరు కొత్త బస్టాండ్‌లో ప్రయాణికులు నిలిచే ప్రాంతాలను దుకాణ దారులు ఆక్రమించుకుని షాప్‌లు ఏర్పాటు చేసుకోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు కార్పొరేషన్‌ కమిషనర్‌ లక్ష్మణ్‌కు ఫిర్యాదు వచ్చింది. దీంతో మంగళవారం ఉదయం కార్పొరేషన్‌ అధికారులు, రెవెన్యూ, పోలీసుల బందోబస్తు నడుమ అధికారులు ఒక్కసారిగా కొత్త బస్టాండ్‌కు చేరుకొని బస్టాండ్‌లోని ఆక్రమిత దుకణాలను తొలగించారు. ఆక్రమణలకు పాల్పడితే దుకాణాల లైసెన్స్‌లను రద్దు చేయడంతోపాటు అపరాధం వసూలు చేస్తామని అధికారులు తెలిపారు. ఉన్న ఫలంగా బస్టాండ్‌లోని దుకాణాలను తొలగించడంతో దుకాణదారులు ఆందోళనకు దిగారు. లక్షలు పెట్టి టెండర్‌ ద్వారా తీసుకొని దుకాణాలు నడుపుతున్నామని అయితే కార్పొరేషన్‌ అధికారులు తరచూ వేధింపులకు గురి చేయడం సరికాదని తెలిపారు. దీంతో పోలీసులు వారితో చర్చలు జరిపి ఆందోళనను విరమింపజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement