వేలూరు: రైతుల జీవనోపాధిని పరిరక్షించేందుకు పంట రుణ మాఫీని పూర్తిగా రద్దు చేయాలని తమిళనాడు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉదయకుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం రైతు సంఘం ప్రతినిధులతో కలిసి వేలూరు కలెక్టర్ సుబ్బలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన పంట రుణమాఫీ హామీ ఆకట్టుకుందని, ప్రస్తుతం రైతులకు మొండిచెయ్యిఇచ్చే విధంగా రూ.50 వేలు మాత్రం రుణమాఫీ చేయడం నిరాశను మిగిల్చిందన్నారు. ఎన్నికల హామీలో రైతులు తీసుకున్న అన్ని రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, వ్యవసాయ పంటలపై తీసుకున్న అన్ని రుణాలను పూర్తిగా రద్దు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు సబ్సిడీ విత్తనాలు లేవ ని, ఎరువులు పూర్తిగా స్టాక్ లేదని, ఇందులో వర్షాలు కూడా సక్రమంగా రాకపోవడంతో ఇదే పరి స్థితి కొనసాగితే రానున్న రోజుల్లో రైతులు పంటలు చేయకుండా కుప్పకూలే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వం వీటిని పరిశీలించి రైతులను ఆదుకోవాలని కోరారు. రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం చేయాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు.


