విద్యుత్‌ సరఫరాకు అంతరాయం | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

May 26 2026 11:59 PM | Updated on May 26 2026 11:59 PM

–స్థానికుల రాస్తారోకో

తిరువళ్లూరు: విద్యుత్‌ సరఫరాలో తరచూ ఏర్పడుతున్న అంతరాయాన్ని నిరసిస్తూ స్థానికులు మనవాలనగర్‌లో రాస్తారోకోకు దిగారు. ట్రాపిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తిరువళ్లూరు జిల్లా మనవాలనగర్‌లోని శిరుతొండన్‌ నగర్‌, జల్లిమేడు, అన్బళగన్‌ నగర్‌, కన్నియమ్మన్‌ నగర్‌ ప్రాంతాల్లో సోమవారం రాత్రి వీచిన గాలులతో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ స్తంభాలు కూలిపోవడంతో సరఫరాను నిలిపివేశారు. అయితే సరఫరా నిలిచి 24 గంటలు దాటిన సరఫరాను పునరుద్ధరించకపోవడంతో ఆగ్రహించిన స్థానికులు మంగళవారం సాయంత్రం తిరువళ్లూరు–పూందమల్లి రోడ్డులో రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు ఆందోళననూ విరమించాలని ఆందోళనకారులను కోరారు. విద్యుత్‌ పునరుద్ధరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని తేల్చిచెప్పడంతో ఉద్రిక్తత నెలకొంది. రాత్రి ఏడు గంటలలోపు విద్యుత్‌ను పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనన విరమించారు. అరగంటపాటు ట్రాఫిక స్తంభించింది.

Advertisement
 
Advertisement
Advertisement