ఆలయ ఏనుగుకు
పుట్టినరోజు
అన్నానగర్: తిరుచ్చిలోని తిరువానైక్కావాల్ జంబుకేశ్వరర్ – అఖిలాండేశ్వరి భక్తులు ఆల య ఏనుగు అఖిల 25వ పుట్టినరోజును ఆదివారం ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. భక్తులు ఏనుగుకు పండ్లు, ఇతర వస్తువులను నైవేద్యంగా సమర్పించారు.
చైన్నెలో
భారీ అగ్ని ప్రమాదం
– మంటల్ని ఆర్పేందుకు వీరోచిత పోరాటం
సాక్షి, చైన్నె : చైన్నె శివారులోని మనలి పుదుర్ వద్ద ఆయిల్ కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లక్ష లీటర్ల మేరకు ఆయిల్ ఉండటంతో మంటల్ని ఆర్పేందుకు విరోచితంగా అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. దట్టమైన పొగ కారణంగా అగ్నిమాపక సిబ్బంది పలువురు అస్వస్థత పాలయ్యారు. మనలి పుదుర్‌లో ని విచ్చురు వద్ద ఓ ప్రవైటు ఆయిల్ కర్మాగారం ఉంది. ఇక్కడ చమురు చిన్న చిన్న బ్యారెల్స్, అతి పెద్ద రెండు బ్యారల్స్‌లో ఉంచారు. సుమారు లక్ష లీటర్ల మేరకు ఇక్కడ చమురు ఉంది. ఈపరిస్థితులలో సోమవారం ఉదయం ఇక్కడ మంటలు చెలరేగడంతో సిబ్బంది బయటకు ఉరకలు తీశారు.మంటల్ని అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడింది. సమాచారంఅ ందుకున్న అగ్నిమాపక వాహనాలు పదుల సంఖ్యలో అక్కడకు చేరుకున్నాయి. పరిసరాలకు మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ పరిసర లలోని కొన్ని నివాసాలలో ఉన్న వాళ్లను సురక్షితప్రాంతానికి తరలించారు. చమురుగు పూర్తి గా ఖాళీ అయ్యే వరకు మంటలు ఎగసి పడే పరిస్థితి నెలకొంది. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా, దట్టమైన పొగ ఆ పరిసరాలలో కమ్ముకోకుండా ముందు జాగ్రత్తలో విరోచితంగా అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తూవస్తున్నారు. పది గంటలకు పైగా మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. మంగళవారం ఉదయంలోపు పూర్తిగా ఆయిల్ దగ్గమైన పక్షంలో మంటలు అదుపులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అతి పెద్ద బేరల్స్ పేలిన క్షణాలలో యాభై అడుగుల మేరకు ఎగసి పడటంతో ఉత్కంఠ నెలకొంది. పలువురు అగ్నిమాపక సిబ్బంది అస్వస్థతకు గురి కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఆ పరిసరాలలో పోలీసులు, వైద్యులు మొహరించి ఉన్నారు. ఎవ్వరికి ప్రస్తుతానికి ఎలాంటి హానీ కలగనప్పటికీ, ముందు జాగ్రత్తలు విస్తృతం చేశారు.
యువకుడి హత్య
– ముగ్గురు అరెస్ట్
తిరువొత్తియూరు: పుదుచ్చేరి సంతై పుదుకుప్పంకు చెందిన జ్ఞానమూర్తి (30) ఇతని భార్య ప్రియ (25) .వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. కొన్ని ఏళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో జ్ఞానమూర్తి తన కుడి కాలును కోల్పోయాడు. ఇతని స్నేహితుడు కదిరవన్ (24), జ్ఞానమూర్తి భార్య ప్రియతో సన్నిహితంగా ఉండటం గమనించిన జ్ఞానమూర్తి, కదిరవన్‌ను హెచ్చరించాడు. దీనివల్ల వారిద్దరి మధ్య శతత్వం ఏర్పడింది. గతంలో ఒక గొడవకు సంబంధించి జైలుకు వెళ్లిన జ్ఞానమూర్తి, నాలుగు రోజుల క్రితమే బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా తన భార్యతో కదిరవన్ సంబంధం కొనసాగిస్తున్నాడని తెలుసుకున్న జ్ఞానమూర్తి, తన స్నేహితులైన గోకుల్ (23) జ్ఞానవేలు (22)తో కలిసి కదిరవన్‌ను హతమార్చడానికి పథకం వేశాడు. ఆదివారం సాయంత్రం జ్ఞానవేలు కదిరవన్‌కు ఫోన్ చేసి ఒక నిర్మానుష్య ప్రాంతానికి రమ్మని పిలిచాడు. కదిరవన్ అక్కడికి చేరుకోగానే, ముగ్గురు వ్యక్తులు కలిసి అతనిపై దాడి చేసి హత్య చేశారు తీశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
మధుమేహంపై
అప్రమత్తంగా ఉండాలి
కొరుక్కుపేట: వాసవి క్లబ్ చెన్నపట్న,వాసవి క్లబ్ వనిత చెన్నపట్న ఆధ్వర్యంలో ఉచిత మధుమేహం (స్థూలకాయం , మధుమేహం స్క్రీనింగ్ శిబిరం) శిబిరంను ఘనంగా నిర్వహించారు.దీనికి చైన్నె కొలత్తూర్ లోని ఎం జి ఆర్ నగర్ లో ఉన్న మెడిఎవరిస్ క్లినిక్ సెంటర్ లో జరిగిన ఈ శిబిరానికి స్థానికంగా ఉన్న పేద ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు.క్యాంప్‌లో బ్లడ్ షుగర్ టెస్ట్, కొలెస్ట్రాల్ చెకప్, శరీర కొవ్వు విశ్లేషణ,డయాబెటిక్ ఫుట్ స్క్రీనింగ్ , మూత్రంలో ఆల్బుమిన్ క్రియాటినిన్ నిష్పత్తి తదితర పరీక్షలను చేసిన వైద్యులు రోగులకు ఆరోగ్య సూచనలు, సలహాలను అందించారు. ఇమ్మిడి కిషోర్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో వాసవీ క్లబ్ చెన్నపట్న ,వనిత చెన్నపట్న అధ్యక్షులు జి ఆర్ అశోక్ కుమార్, జనని, సెక్రటరీలు డాక్టర్ ఎం .చంద్ర గుప్తా ,తనుజ, కోశాధికారులు జి వి రాధాకష్ణన్ ,గీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


