వృద్ధురాలి గొంతు నులిమి హత్య | - | Sakshi
Sakshi News home page

వృద్ధురాలి గొంతు నులిమి హత్య

May 22 2026 4:28 AM | Updated on May 22 2026 4:28 AM

తిరుత్తణి: ఒంటరిగా నిద్రిస్తున్న వృద్ధురాలి ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి, ఆమె గొంతు నులిమి హత్య చేసి, బీరువాలో ఉంచిన ఆరున్నర సవర్ల నగలు, కిలో వెండి వస్తువులు, రూ. 30,000 వేలు విలువైన విద్యుత్‌ ఉపకరణాలను దోచుకెళ్లిన ఘటన కలకలం రేపింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా, పుండి యూనియన్‌, పుత్తూరు పంచాయతీ పరిధిలోని ఝెల్లపాప నాయుడు పైట్టె గ్రామానికి చెందిన నాగయ్య భార్య సుకున (70). ఆమె భర్త చనిపోగా, కుమారుడు, కుమార్తె అమెరికాలో నివసిస్తున్నారు. దీంతో గ్రామంలోని ఇంట్లో సుకున ఒంటరిగా నివసిస్తోంది. ఈనేపథ్యంలో బుధవారం రాత్రి ఆ వృద్ధురాలు ఎప్పటిలాగే ఇంట్లో నిద్రిస్తోంది. ఈ సమయంలో అర్ధరాత్రి నలుగురు వ్యక్తుల ముఠా ఒకటి వెనుక తలుపు పగలగొట్టి ఇంట్లోకి చొరబడింది. వారు ఆవృద్దురాలి గొంతు నులిమి, బెదిరించి, బీరువా తాళం పగలగొట్టి, ఆరున్నర సవర్ల నగలు, కిలో వెండి వస్తువులు, రూ. 30 వేల విలువైన ఇత్తడి వస్తువులు, విద్యుత్‌ ఉపకరణాలను దోచుకెళ్లారు. ఇరుగుపొరుగు వారు వచ్చి చూసేసరికి ఆ వృద్ధురాలి చేతులు, కాళ్లు కట్టేసి ఉన్నాయి. గ్రామస్థులు వెంటనే కనకమ్మ చత్రం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

కనకమ్మ సత్రం పోలీసులు కేసు నమోదు చేసి దోపిడీపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా రెండు రోజుల క్రితం, తిరువలన్కాడ్‌ సమీపంలోని వీరరాఘవపురం గ్రామంలో, ఓ యువతి ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తుండగా, గుర్తుతెలియని వ్యక్తులు ఆమె మెడలోని 10 సవర్ల తాళి గొలుసులను లాక్కున్నారు. ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దోపిడీ, తిరువేలాంగాడు ప్రాంతంలోని గ్రామస్తులలో భయాన్ని సృష్టించింది.

Advertisement
 
Advertisement
Advertisement