‘ఎల్లో ఎల్లో డర్టీ ఫెలో’ ఫస్ట్‌లుక్‌ విడుదల | - | Sakshi
Sakshi News home page

‘ఎల్లో ఎల్లో డర్టీ ఫెలో’ ఫస్ట్‌లుక్‌ విడుదల

May 22 2026 4:16 AM | Updated on May 22 2026 4:16 AM

తమిళసినిమా: ఏపీ ఇంటర్నేషనల్‌, విష్ణు విశాల్‌ స్టూడియోస్‌ సంస్థల అధినేతలు సంజయ్‌ అర్జున్‌ దాస్‌ వాద్వా, నటుడు విష్ణు విశాల్‌ కలిసి నిర్మించిన తాజా చిత్రం ఎల్లో ఎల్లో డర్టీ ఫెలో. ఈ చిత్రం ద్వారా విక్కీ భాస్కర్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన పలు లఘు చిత్రాలుతో పాటు చిత్రాలకు పని చేశారు. ఓహో ఎందన బేబీ చిత్రం ఫేమ్‌ నందన్‌ ప్రీతి అస్రాని జంటగా నటించిన ఈ చిత్రంలో నటి ఏంజెల్‌ మరియా,మోనీషా మోహన్‌, కరుణాకరన్‌, జాన్సన్‌ దివాకర్‌, నిఖిలా శంకర్‌,చేతన్‌,దేవదర్శిణి,అనుపమ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. కాగా చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, టీజర్‌ను విడుదల చేశారు. ఇది నవీన కాల యువత ప్రేమ, వారి జీవన విధానాన్ని మనసులను ఆకట్టుకునే ఫీల్‌ గుడ్‌ కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు పేర్కొన్నారు. విడుదలైన ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో జెన్‌ జీ తరాలను ఆకట్టుకునే జనరంజక, సన్నివేశాలు చోటు చేసుకోవడంతో చిత్రపరిశ్రమ నుంచి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని చెప్పారు. చిత్ర షూటింగ్‌ ను చైన్నె, వియత్నాం, పరిసర ప్రాంతాలలో నిర్వహించిన పూర్తి చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. త్వరలోనే చిత్ర ట్రైలర్‌, ఆడియో విడుదల వివరాలను వెల్లడించనున్నట్లు చెప్పారు. ఈ చిత్రానికి లూక్‌ జోస్‌ ఛాయాగ్రహణం, భరత్‌ శంకర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement