అన్నానగర్: నీలగిరి అటవీ రిజర్వ్ పరిధిలోని అంభి డివిజన్ సమీపంలో ఉన్న అళగర్ కొండలలోని వ్యవసాయ క్షేత్రంలో ఏప్రిల్ 25వ తేదీన రెండు పులి పిల్లలు సంచరిస్తున్నాయని అటవీ శాఖకు సమాచారం అందింది. అటవీ శాఖ అధికారులు అక్కడికి వెళ్లి 5 నెలల ఆడ పులి పిల్లను రక్షించారు. ఆ పులి పిల్లకు పశువైద్యులు ప్రత్యేక చికిత్స అందించారు. అటవీ శాఖ అధికారులు మరో పులి పిల్ల కోసం కూ డా గాలిస్తుండగా, మంగళవారం దాన్ని రక్షించారు. అటవీ శాఖ అధికారులు ఆ పులి పిల్లకు చికిత్స అందిస్తున్నారు. ఇంతలో మొదట పట్టుబడిన పులిపిల్ల చికిత్స ఫలించక గురువారం మరణించింది. పోస్ట్‌మార్టం నిర్వహించి పూడ్చివేశారు. మరో పులి పిల్ల ను చికిత్స కోసం వండలూర్ జూకు తరలించారు.
బావిలో పడి ..
అన్నానగర్: నీలగిరి జిల్లా, కూడలూరు తాలూకాలోని ఓవెలి టౌన్ పంచాయతీ పరిధిలో, బార్‌వుడ్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఎస్–స్టేట్ ఏరియాలో పాడుపడిన బావిలో గురువారం ఓ పులి చనిపోయి కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న అటవీ శా ఖ అధికారులు వెళ్లి పరిశీలించారు. 10 అడుగుల లో తు బావిలో పులి, అడవి పంది చనిపోయి పడి ఉండడడంతో దర్యాప్తు చేపట్టారు. మగ పులి అడవి పందిని వేటాడేందుకు తరుముకుంటుండగా, ఆ అడవి పంది బావిలో పడి ఉండవచ్చని భావిస్తున్నారు. పులి కూడా పరిగెడుతున్న వేగం కారణంగా బావిలో పడి చనిపోయి ఉండవచ్చని భావించి పోస్టుమార్టం నిర్వహించి కళేబరాలను పూడ్చివేశారు.


