తిరుత్తణి హుండీ ఆదాయం రూ.1.78 కోట్లు | - | Sakshi
Sakshi News home page

తిరుత్తణి హుండీ ఆదాయం రూ.1.78 కోట్లు

May 1 2026 5:45 AM | Updated on May 1 2026 5:45 AM

తిరుత్తణి: తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.1.78 కోట్లు లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి ప్రతిరోజూ వేలాదిగా భక్తు లు విచ్చేసి స్వామి దర్శనం చేసుకుంటారు. తమ మొక్కులు చెల్లించే విధంగా హుండీల్లో కానుకలు చెల్లిస్తారు. భక్తులు చెల్లించిన హుండీల కానుకలను నెలకు ఒక్కసారి ఆలయ నిర్వాహకుల సమక్షంలో లెక్కిస్తారు. చివరి 34 రోజుల్లో భక్తులు హుండీల్లో వేసిన కానుకలను బుధవారం ఆలయ జాయింట్‌ కమిషనర్‌ రమణి సమక్షంలో వసంత మండపంలో లెక్కించారు. లెక్కింపులో రూ.1.78 కోట్ల నగదు, 532 గ్రాముల బంగారం, 7,258 గ్రాముల వెండిని కానుకగా చెల్లించినట్లు ఆలయ అధికారులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement