కొత్త చిత్రానికి విక్రమ్‌ప్రభు రెడీ
తమిళసినిమా: మంచి కంటెంట్‌తో కూడిన కథా లభిస్తే విజయం సాధ్యమేనని తాజాగా సిరాయి చిత్రంతో నిరూపించిన నటుడు విక్రమ్‌ప్రభు. ఆ చిత్రం ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పుడు కథలు ఎంపికపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు ఆయన ఇటీవల ఒక వేదికపై చెప్పారు. అలా తాజాగా ఒక కొత్త చిత్రానికి పచ్చజెండా ఊపారు. ఈ చిత్రం ద్వారా సిద్ధార్థ్ అనే నూతన దర్శకుడికి అవకాశం కల్పించారు. ఈ చిత్రాన్ని రోమియో పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది. ఇందులో విక్రమ్ ప్రభుతో నటించే నటి, ఇతర నటీనటులు, సాంకేతిక ఎంపిక జరుగుతోందని యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. ఈ చిత్రం కథ విభిన్నంగా ఉంటుందని, కథనం కూడా కొత్తగా ఉంటుందని పేర్కొన్నారు. విక్రమ్‌ప్రభును మరో కోణంలో ఆవిష్కరించే కథా చిత్రంగా ఇది ఉంటుందంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రం తరువాత విక్రమ్‌ప్రభు మరో కొత్త దర్శకుడితో పనిచేయడానికి అంగీకరించినట్లు సమాచారం. మొత్తంమీద సిరాయి చిత్రం ఈయన్ని మళ్లీ బిజీ చేసిందన్నమాట.
న్యాయవాదిగా
కీర్తిసురేష్


