శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించాలి | - | Sakshi
Sakshi News home page

శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించాలి

Apr 3 2026 7:32 AM | Updated on Apr 3 2026 7:32 AM

వేలూరు: ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించి పరిశోధనాత్మక ఆలోచన విధానాన్ని అలవరచడం నేర్పించాలని జిల్లా విద్యాశాఖ సీఈఓ ప్రేమలత అన్నారు. రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల్లో సృజనాత్మకశక్తిని బయటకు తీసుకొచ్చేందుకు, పరిశోధన విద్యపై ఆశక్తి పెంచేందుకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వ పాఠశాల టీచర్లకు ప్రతి ఏడాది ఇంద్రధనస్సు పథకం కింద శిక్షణ ఇస్తుంది. అందులో బాగంగా వేలూరులోని సమగ్ర పాఠశాల విద్యా సదస్సు భవనంలో తరగతులను ఆమె ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ వేలూరు జిల్లాలో ఇంద్రదనస్సు పథకంలోని టీచర్లు విద్యార్థుల మేధాశక్తిని వెలికి తీసేందుకు ప్రయత్నించాలన్నారు. చిన్నప్పటి నుంచే పరిశోధనలపై ఆశక్తి చూపితే రానున్న రోజుల్లో మరిన్ని పరిశోధనలు చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. అనంతరం విద్యా సంవత్సరానికి ముగింపు కార్యక్రమంలో జిల్లాకు చెందిన అంకితభావంతో సేవలు అందజేసిన వారికి జ్ఞాపికలతోపాటు సర్టిఫికెట్లను అందజేశారు. జిల్లా సహాయ ప్రాజెక్టు అధికారి జ్వోతీశ్వరపిళ్లై, తమిళనాడు సైన్స్‌ ఫోరం అద్యక్షుడు జనార్దన్‌, కార్యదర్శి రాజేంద్రన్‌, ముత్తుసిలుపన్‌, ఇంద్రధనస్సు పథకం సమన్వయకర్త కుమార్‌, సహాయ సమన్వయకర్త విశ్వనాథన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement