కామకోటికి ‘ఐకాన్‌ ఆఫ్‌ ది మంత్‌’ గౌరవం | - | Sakshi
Sakshi News home page

కామకోటికి ‘ఐకాన్‌ ఆఫ్‌ ది మంత్‌’ గౌరవం

Mar 31 2026 8:32 AM | Updated on Mar 31 2026 8:32 AM

సాక్షి, చైన్నె: సాంకేతిక రంగంలో అద్భుత ఆవిష్కరణలు, విద్యా నాయకత్వంలో పోషించిన కీలక పాత్రకు గుర్తింపుగా ఐఐటీ మద్రాస్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వి. కామకోటిని ‘సూపర్‌ చైన్నె’ సంస్థ మార్చి 2026 నెలకుగాను ‘ఐకాన్‌ ఆఫ్‌ ది మంత్‌’ పురస్కారంతో సత్కరించింది. స్వదేశీ ప్రాసెసర్ల అభివృద్ధి, సైబర్‌ సెక్యూరిటీ , హై–పెర్ఫార్మెన్స్‌ కంప్యూటింగ్‌ రంగాలలో భారతదేశాన్ని స్వావలంబన దిశగా నడిపించడంలో ప్రొఫెసర్‌ కామకోటి కృషి అనన్యసామాన్యంగా ప్రకటించారు. ఆయన నాయకత్వంలో ఐఐటీ మద్రాస్‌ కేవలం విద్యా సంస్థగానే కాకుండా, డీప్‌–టెక్‌ స్టార్టప్‌లకు, పరిశోధనలకు ప్రపంచ స్థాయి కేంద్రంగా ఎదిగిందని ప్రకటించారు. చైన్నె నగరాన్ని ప్రపంచ పటంలో సగర్వంగా నిలబెడుతున్న వ్యక్తులను సత్కరించే క్రమంలో, ఈ నెలకు ప్రొఫెసర్‌ కామకోటిని ఎంపిక చేసినట్లు ‘సూపర్‌ చైన్నె’ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రంజీత్‌ రాథోడ్‌ తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కె. స్టాలిన్‌ చేతుల మీదుగా ప్రారంభమైన ‘సూపర్‌ చైన్నె’, నగరాన్ని సాంకేతిక, వైద్య, సాంస్కృతిక రంగాలలో గ్లోబల్‌ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు ప్రకటించారు. క్రెడాయ్‌ చైన్నె ఆధ్వర్యంలో సాగుతున్న ఈ సామాజిక విప్లవం, నగర గర్వాన్ని ప్రపంచానికి చాటిచెబుతోంది. ప్రొఫెసర్‌ కామకోటిని వరించిన ఈ గౌరవం, చైన్నెలోని విద్యా పరిశోధనా రంగానికి దక్కిన గొప్ప గుర్తింపుగా భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement