తెలుగు లోగిళ్లలో శ్రీరామనవమి | - | Sakshi
Sakshi News home page

తెలుగు లోగిళ్లలో శ్రీరామనవమి

Mar 28 2026 7:52 AM | Updated on Mar 28 2026 7:52 AM

సాక్షి,చైన్నె: చైన్నె నగరంలో తెలుగు లోగిళ్లు రామనామ స్మరణ మార్మోగింది. శ్రీసీతారాముల కల్యాణ వైభోగం రమణీయంగా జరిగింది. అశేషంగా భక్తులు తరలివచ్చి సీతారాముల కల్యాణాన్ని కనులారా తిలకించి తరించారు .

చైన్నెలోని శ్రీవారి ఆలయంలో..

శ్రీరామనవమి పురస్కరించుకుని చైన్నె టి.నగర్‌ , వెంకటనారాయణ రోడ్డులోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం నిర్వహించారు. చైన్నె టీటీడీ స్థానిక సలహామండలి మాజీ అధ్యక్షుడు ఎన్‌ శ్రీకృష్ణ, ఆనందకుమార్‌ రెడ్డి, మాజీ సభ్యులు అనిల్‌కుమార్‌ రెడ్డి, మోహన్‌రావు, కార్తికేయన్‌, జయదేవ్‌, సత్యనారాయణ , రంగారెడ్డి, ఏఈఓ ధనుంజయ్‌ పాల్గొన్నారు.

మద్రాసు మిర్చి వర్తక సంఘం

ది మద్రాసు మిర్చి వర్తక సంఘం ఆధ్వర్యంలో 118 వ వార్షిక శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. చైన్నె అదియప్ప నాయకన్‌ వీధిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి కన్వెన్షన్‌ హాలు వేదికగా శ్రీ రామనవమి ఉత్సవ కమిటీ చైర్మన్‌ విజే సురేష్‌కుమార్‌ అధ్యక్షతన వేడుకలు, సీతారాముల కల్యాణాన్ని కనులపండువగా నిర్వహించారు.

శ్రీఆంధ్ర కళాస్రవంతి ఆధ్వర్యంలో

శ్రీ ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో 37వ సంవత్సర శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా శుక్రవారం నిర్వహించారు. చైన్నె కొరట్టూర్‌ అగ్రహారంలోని రామాలయం వీధిలోని శ్రీ కోదండరామాలయం హాలు వేదికై ంది. శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీ ఆంధ్ర కళాస్రవంతి అధ్యక్షుడు జె ఎం నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలు జరిగాయి. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. అన్నానగర్‌ ఎమ్మెల్యే మోహన్‌, స్రవంతి ప్రధాన సెక్రటరీ జె. శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

చైన్నె తెలుగు అసోసియేషన్‌:

చైన్నె తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో చైన్నె మదురవాయిల్‌లోని శ్రీ సీతాలక్ష్మి కల్యాణ మండపం వేదికగా శ్రీ సీతారాముల కల్యాణాన్ని శుక్రవారం నిర్వహించారు. అసోసియేషన్‌ అధ్యక్షుడు గోపాల కృష్ణా రెడ్డి, సెక్రటరీ వెంకయ్య నాయుడు పాల్గొన్నారు.

తెలుగు ప్రజా సంక్షేమ సంఘంలో:

చైన్నె కొడుంగైయూర్‌ సీతారామనగర్‌లో ఉన్న సీతారామనగర్‌ తెలుగు ప్రజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీరామనవమిని పురస్కరించుకు ని సీతారాముల వారి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు . సంఘం అధ్యక్షుడు కె శ్రీనివాస కుమార్‌ , కార్యదర్శి పి. లక్ష్మణ రావు , ట్రెజరర్‌ డి. పిచ్చేశ్వరరావు పాల్గొన్నారు.

శ్రీ గీతా భవన్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో

చైన్నె గోపాలపురంలోని శ్రీ గీతా భవన్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో శ్రీరామనవి వేడుకలు అత్యంతవైభవంగా నిర్వహించారు. గీతా భవన్‌ ట్రస్ట్‌ చైర్మ న్‌ ఓంప్రకాష్‌ మోడీ, మేనేజింగ్‌ ట్రస్టీ మనుగోయల్‌ ,కోశాదికారి మురళీ లాల్‌ సాంతాలియా పాల్గొన్నారు.

ఎస్‌కేపీడీలో శ్రీరామనవమి

చైన్నెలోని శ్రీ కన్యపరమేశ్వరి ఆలయంలో ఉత్స వాలు శుక్రవారం వైభవంగా ఆరంభమయ్యా యి. హంస వాహనంపై శ్రీరామచంద్రమూర్తులను వేంచేపు చేసి పూజలను నిర్వహించారు. అదేవిధంగా చైన్నె పాతచాకలిపేటలో నూతనంగా నిర్మించి కుంభాభిషేకం జరుపుకున్న ఆలయంలో అంగరంగవైభవంగా రాములోరి పెళ్లి జరిపించారు.

హిందూ కళాశాలలో..

కొరుక్కుపేట: ధర్మమూర్తిరావు బహదూర్‌ కలవల కన్నన్‌ చెట్టి హిందూ కళాశాల, తెలుగు శాఖ తెలుగు భాషా సమితి తరఫున ఉగాది వేడుక లు, ముగింపు సమావేశాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కళాశాల ప్రధాన అధ్యాపకులు డా. కల్విక్కరసి మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు కొత్త విద్యార్థులను ఈ శాఖలో చేర్పించడానికి తమవంతు సహకా రన్ని అందించాలని ఆకాంక్షించారు. సహాయాచార్యులు డా. తుమ్మపూడి కల్పన ఉగాది ప్రా ముఖ్యతను, శ్రీరామనవమి వైశిష్ట్యాన్ని విద్యార్థులకు వివరించారు. మూడో సంవత్సరం విద్యార్థులు బాబు, సైమన్‌లకు శాఖ తరఫున బహుమతులను అందించారు.

మద్రాసు మిర్చి వర్తక సంఘంలో సీతారాముల కల్యాణం

ఆంధ్ర కళా స్రవంతిలో సీతారాముల కల్యాణం

చైన్నె తెలుగు అసోసియేషన్‌లో శ్రీరామనవమి

ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

వేలూరు: వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల్లో శ్రీరామనవమిని ఘనంగా జరుపుకున్నారు. శుక్రవారం ఉదయం రాములోరికి ప్రత్యేక పూ జలు, అభిషేకాలు, పుష్పాలంకరణలు చేశారు. దీంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేలూరు రంగాపురంలోని కోదండరాముడి ఆలయంలోని స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేసి పుష్పాలంరణలు చేశారు. అదేవిధంగా వాలాజలోని ధన్వంతరి ఆరోగ్య పీఠంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని పీఠాధిపతి మురళీధరస్వామిజీ ఆధ్వర్యంలో పీఠంలో ప్రతిష్ఠించిన శ్రీ పట్టాభిషేకరాముడికి మహా అభిషేకం, పుష్పాలంకరణలు చేశా రు. ముందుగా ఉదయం 6 గంటలకు మహాగణ పతి పూజ, గోపూజ, 1008 కలశాలకు ప్రత్యేక పూజ లు, లక్ష్మీపూజ, సకల దేవతా హోమం, మహా సంకల్పం నిర్వహించారు. ఉదయం 10 గంటలకు ధన్వంతరి మూలమంత్ర జపం, పట్టాభిరాముడికి మహాఅభిషేకం, మహా పూర్ణాహుతి, చతుర్వేద పారాయణం, ప్రసాద వినియోగం నిర్వహించారు. అదేవిధంగా తిరువణ్ణామలై జిల్లాలోని శ్రీ రాముడి ఆలయాల్లోనూ ప్రత్యేక పూజలు చేశారు. వేలూరు జిల్లా కేవీ కుప్పం సమీపంలోని అరుంబాక్కం పంచాయతీ పరిఽధి లోని చెన్నారెడ్డివూరు గ్రామంలోని ఆలయంలో స్వామివారికి తిరుకల్యాణోత్సవం నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు. అలాగే చిన్నలత్తే రి గ్రామంలోని రాముడి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కల్యాణోత్సవం నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement