అసెంబ్లీ ఎన్నికల్లో తిరుమా పోటీ | - | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ ఎన్నికల్లో తిరుమా పోటీ

Mar 30 2026 8:39 AM | Updated on Mar 30 2026 8:39 AM

సాక్షి, చైన్నె : అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడానికి వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్‌ నిర్ణయించారు. ఆయన కాట్టుమన్నార్‌ కోవిల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్‌ తమిళనాడులో దళిత సామాజిక వర్గానికి చెందిన బలమైన నేతగా ఉన్న విషయం తెలిసిందే. 2009లో చిదరంబరం లోక్‌ సభ నుంచి ఆయన పార్లమెంట్‌కు వెళ్లారు. 2014లో ఓటమి పాలయ్యారు. 2019లో మళ్లీ అదే నియోజవర్గం నుంచి గెలిచారు. 2014లోనూ అదే నియోజకర్గం నుంచి ఎంపీ అయ్యారు. మూడు సార్లు ఎంపీగా పార్లమెంట్‌కు వెళ్లారు. ఈ పరిస్థితులలో ఆయన ప్రపథమంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడానికి నిర్ణయించారు. డీఎంకే కూటమిలో వీసీకేకు 8 సీట్లు కేటాయించారు. ఇందులో కాట్టుమన్నార్‌ కోవిల్‌(రి) నుంచి తిరుమావళవన్‌ పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. ఈమేరకు ఆయన ఆదివారం రాత్రి వీడియో ద్వారా వీసీకే తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఆ మేరకు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న తిరుమావళవన్‌ కాట్టుమన్నార్‌ కోవిల్‌(రి) నియోజకవర్గంలో, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సిందనై సెల్వన్‌ చేయూర్‌(రి) నియోజకవర్గంలో పోటీ చేయనున్నారు. అలాగే, , తిరుప్పోరూర్‌: నియోజకవర్గంలో పార్టీ నిర్వాహక కార్యదర్శి పన్నీరు దాసు, అరక్కోణం(రి)లో న్యాయవాది ఎలిల్‌ కరోలి, దిండివనం(రి)లో పార్టీ సంయుక్త కార్యదర్శి వన్నియరసు, పెరియకుళం(రి)లో మరో సంయుక్త కార్యదర్శి శక్తి వేల్‌ అలియాస్‌ ఆర్టల్‌ అరసు,కళ్లకురిచ్చి(రి)లో న్యాయవాది మాలతి , బన్రూటి నియోజకవర్గంలో మైనారిటీ నేత అబ్దుల్‌ రహ్మాన్‌ పోటీ చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement