తిరువళ్లూరు: స్థానికులకే టికెట్ కేటాయించాలని కోరుతూ టివీకే శ్రేణులు రాస్తారోకోకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. తిరువళ్లూరు జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు టీవీకే అభ్యర్థులను ప్రకటించింది. తిరువళ్లూరు నియోజకవర్గానికి సేలం జిల్లాకు చెందిన అరుణ్‌కుమార్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో ఆగ్రహించిన పార్టీ శ్రేణులు తిరువళ్లూరు టీవీకే అభ్యర్థిగా స్థానికులకే అవకాశం ఇవ్వాలని కోరుతూ రాస్తారోకో నిర్వహించారు. టీవీకే అధినేత విజయ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే అభ్యర్థిని మార్చాలని లేని పక్షంలో నియోజకవర్గంలోని పార్టీ సభ్యులు మాకుమ్మడిగా రాజీనామా చేస్తామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని టీవీకే నేతలను చుట్టముట్టారు. ఎన్నికల కోడ్ అమల్లో వున్న క్రమంలో రాస్తారోకో నిర్వహించడం సరికాదని, వెళ్లకుంటే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. దీంతో పార్టీ నేతలు అక్కడి నుంచి జారుకున్నారు.


