తిరువళ్లూరు: నివాస ప్రాంతాల్లో సెల్‌ఫోన్ టవర్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ స్థాఽనికులు ఆందోళనకు దిగారు. తిరువళ్లూరు జిల్లా చోళవరం యూనియన్ చెంబులివరం గ్రామంలో 5వేల మంది ప్రజలు నివాసం వుంటున్నారు. ఈ గ్రామంలో సెల్ టవర్ నిర్మాణానికి గత రెండు నెలల క్రితం పనులను చేపట్టారు. అయితే తమ ప్రాంతంలో సెల్‌ఫోన్ టవర్ నిర్మాణం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడుతాయని వాపోయిన స్థానికులు వెంటనే పనులను నిలిపివేయాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు. విషయం తెలసి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. ఉన్నతాధికారులతో మాట్లాడి పనులను నిలిపివేసే అంశాన్ని పరిశీలిస్తామన్న హామీతో ఆందోళనన విరమించారు.


