తిరువళ్లూరు: ప్రవత్తి 2కే26 వేడుకలు పేరిట ప్రత్యూష కళాశాల నిర్వహించిన సాంస్కృతి కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకుంది. తిరువళ్లూరు జిల్లా అరణ్‌వాయల్‌కుప్పంలో ప్రత్యూష ఇంజనీరింగ్ కళాశాల వుంది. ఈ కళాశాలలో ఏటా సాంస్కతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది ప్రవత్తి 2కే26 పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని శుక్ర శని తదితర రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. వేడుకలను కళాశాల ఛైర్మన్ రాజారావ్ అద్యక్షత వహించి ప్రారంభించారు. కళాశాల డైరెక్టర్ హైమావతి, ట్రస్టీ షఖీల తదితరులు ప్రారంభోపన్యాసం చేశారు. ప్రిన్సిపల్ డాక్టర్ రమేష్ అతిధిలను పరిచయం చేశారు. కాగా వేడుకలు ఏఐడీఎస్ విభాగం విద్యార్దులు చేసిన భరతనాట్యం పలువురిని ఆకట్టుకుంది. ముఖ్యఅతిధిలుగా సినీనటులు హర్షత్‌ఖాన్, అఽధిర్చి అరుణ్ సినీ నటి మిర్నాలినిరవి, విజయ్‌టివీ ప్రముఖులు మోసస్, రిక్కీ, చరణ్, సయ్య్‌ద్, అమర్‌ధీప్ చౌదరి, అక్రమ్ తదితరులు హాజరైృయ్యారు. వీరు ఆటలు పాటలతో విద్యార్దులను ఉత్సాహపరిచారు. సంగీతం, పాటలు, డాన్స్‌లతో కళాశాల ఆవరణం సందడిగా మారింది. వైస్ ఛైర్మన్ చరణ్‌తేజ, సీఈఓ ప్రత్యూష, కల్చరల్ కోర్డినేటర్‌లు ఉమ, శ్రీదేవి పాల్గొన్నారు.


