కస్తూరి రాజా పాత్ర హబీబీ చిత్రానికి బలం | - | Sakshi
Sakshi News home page

కస్తూరి రాజా పాత్ర హబీబీ చిత్రానికి బలం

Mar 27 2026 8:55 AM | Updated on Mar 27 2026 8:55 AM

తమిళసినిమా: ఇంతకు ముందు పలు వైవిధ్య భరిత కథా చిత్రాలను రూపొందించిన దర్శకుడు మీరా కదిరవన్‌. తాజాగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం హబీబీ. ఈ చిత్రంలో సీనియర్‌ దర్శకుడు నటుడు ధనుష్‌ తండ్రి కస్తూరి రాజా చాలా కీలకపాత్రను పోషిస్తున్నారు. పాత్ర గురించి ఆయన మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ ఇందులో తన పాత్ర చిత్ర యూనిట్‌ను ఆదరించే విధంగా, వారికి మరింత బలం చేకూర్చేదిగా ఉంటుందన్నారు. మంచి కథ కచ్చితంగా ప్రేక్షకుల చెంతకు చేరుతుందని తాను నమ్ముతానన్నారు. ఈ చిత్రంలోనూ యదార్థత ఉందని అన్నారు. దర్శకుడు మీరా కదిరవన్‌ పేర్కొంటూ హబీబీ చిత్రంలో దర్శకుడు కస్తూరి రాజా నటించడం తమకు పక్క బలంగా అమిరిందన్నారు. ఆయన అనుభవం తమ పయనానికి అర్ధాన్ని, నమ్మకాన్ని కలిగించిందన్నారు. మత విభేదాలను మించి సమాజంలో పెద్దలకు మనం ఇచ్చే గౌరవాన్ని ఈ చిత్రంలో ఆయన పాత్ర ప్రతిబింబించే విధంగా ఉంటుందన్నారు. సమైక్యత, నిజాయితీ భావోద్రేకాలతో కూడిన పాత్రను కస్తూరి రాజా పోషిస్తున్నట్లు చెప్పారు. సీనియర్‌ నటుడైన ఆ భావాన్ని ఎక్కడ వ్యక్తం చేయకుండా సర్వ సాధారణంగా తమతో కలిసి మెలిగారని చెప్పారు. విచిత్రాన్ని రోమియో పిక్చర్స్‌ సంస్థ డిస్ట్రిబ్యూషన్‌ చేస్తుందని చెప్పారు. మంచి బలమైన కథ,కథనాలతో కూడిన సందేశాత్మక కథా చిత్రాలను ఆదరిస్తూ వస్తున్న ఈ సంస్థ చక్కని మార్కెటింగ్‌తో చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకెళుతుందని పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా, అనుభవజ్ఞుల మార్గదర్శకంలో, శక్తివంతమైన డిస్ట్రిబ్యూషన్‌ ఆదరణతో తెరపైకి రానున్న హబీబీ చిత్రం ప్రేక్షకుల గుండెల్లో పది కాలాలపాటు నిలిచిపోతుందని నమ్మకాన్ని దర్శకుడు మీరా కదిరవన్‌ వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement