క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Mar 26 2026 11:41 AM | Updated on Mar 26 2026 11:41 AM

పుస్తకావిష్కరణ చైన్నెలో ట్రాన్స్‌జెండర్ల నిరసన తిరుత్తణి కొండ ఆలయంలో ఆటో బోల్తా ● నలుగురికి తీవ్రగాయాలు పోలింగ్‌ కేంద్రాల పరిశీలన

కొరుక్కుపేట: మద్రాసు వర్సిటీ తెలుగుశాఖ, జనని సంయుక్త నిర్వహణలో డా. కాసల నాగభూషణం రచించిన ‘ఆధునికాంధ్ర కవిత్వం– తాత్త్వికతా వైవిధ్యం’ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. పుస్తకాన్ని గాడిపర్తి రాజా ఆవిష్కరించారు. పుస్తకం తొలిప్రతిని నూతలపాటి రాజా స్వీకరించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మద్రాసు వర్సిటీ, తెలుగుశాఖ అధ్యక్షుడు ఆచార్య విస్తాలి శంకరరావు మాట్లాడుతూ ఈ పుస్తకం తెలుగు సాహితీ విమర్శనా రంగంలో ఒక మణిహారం అని వ్యాఖ్యానించారు పుస్తకావిష్కరణలో పాండురంగం కాళియప్ప, కాకుటూరు అనిల్‌కుమార్‌రెడ్డి, డా.జొన్నలగడ్డ వెంకటరమణ, డా.నిర్మల, సరోజిని, గుడిమెట్ల చెన్నయ్య, డా. మాదా శంకరబాబు, డా. ప్రణవి, సురేష్‌, డా.ఆముక్తమాల్యద, శ్రీలక్ష్మీ, తమ్మినేని బాబు, డా.ఆంబ్రూణి, పి. జయశ్రీ, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

కొరుక్కుపేట: లోక్‌సభలో ప్రవేశపెట్టిన ట్రాన్స్‌జెండర్‌ (హక్కుల పరిరక్షణ) సవరణ బిల్లుకు వ్యతిరేకంగా తమిళనాడు ట్రాన్స్‌జెండర్‌ సంక్షేమ బోర్డు సభ్యులందరూ సంయుక్తంగా నిరసన తెలిపారు. చైన్నె కలెక్టరేట్‌ సమీపంలో బుధవారం జరిగిన నిరసనలో ట్రాన్స్‌జెండర్‌ హక్కుల సవరణ బిల్లు 2026ను తక్షణమే ఉపసంహరించుకోవాలి. రాజ్యాంగం ప్రకారం లింగ గుర్తింపు హక్కును పరిరక్షించాలి, ట్రానన్స్‌జెండర్‌ పరిరక్షణ చట్టం, 2019ని పూర్తిగా రద్దు చేయాలని నినదించారు. ఈ బిల్లు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే కాకుండా, ట్రాన్స్‌జెండర్‌ వర్గాల గుర్తింపులను తొలగిస్తుంది. దీనివల్ల ట్రాన్స్‌జెండర్‌ వర్గాలు చట్టపరమైన గుర్తింపు, రక్షణ పొందలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలి అని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ, ట్రాన్స్‌జెండర్‌ సంక్షేమ సంఘం కోరింది.

తిరుత్తణి: తిరుత్తణి కొండ ఆలయ ఘాట్‌రోడ్డులో ఆటో బోల్తాకొట్టి భక్తులు నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. తిరుత్తణి పోలీసుల కథనం మేరకు వేలూరు జిల్లా తోటపాళ్యం గ్రామానికి చెందిన ముత్తువేల్‌(49) అతని భార్య శాంతి దంపతులు కలిసి వారి ఇద్దరు పిల్లలు మణిమేగళై, కిషోర్‌తో కలిసి ఆటోలో బుధవారం తిరుత్తణి కొండకు వచ్చి సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఇంటికి తిరుగు ప్రయాణంలో కొండ ఘాట్‌రోడ్డులో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో దంపతులు వారి ఇద్దరి పిల్లలకు గాయాలయ్యాయి. వారిని పోలీసులు కాపాడి 108 అంబులెన్స్‌ ద్వారా తిరుత్తణి ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి చికిత్స పొందుతున్నారు.

పళ్లిపట్టు: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి మంగళవారం పరిశీలించారు. రాష్ట్ర అసెంబ్లీకి ఏప్రిల్‌ 23వ తేదీ పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈనెల 30న నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లకు ఏర్పాట్లు, భద్రతపై కలెక్టర్‌ ప్రతాప్‌ పరిశీలించారు. పళ్లిపట్టు సమీపంలోని కుమారాజుపేట పోలింగ్‌ కేంద్రంలో పరిశీలించి ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేసి ఏర్పాట్లను వివరించారు. అనంతరం కలెక్టర్‌ను ఆహ్వానించేందుకు వీలుగా పాఠశాలలో వేచివున్న విద్యార్థులను చూసి ఎన్నికల పట్ల విద్యార్థులకు తెలిసిన విషయాలను అడిగి తెలుసున్నారు. కలెక్టర్‌ వెంట తిరుత్తణి నియోజకవర్గ ఎన్నికల నిర్వహణాధికారి కణిమొళి పాల్గొన్నారు. అలాగే తిరుత్తణి మర్రిమాను వీధిలోని పోలింగ్‌ కేంద్రంలో పోలింగ్‌కు ఏర్పాట్లను తనిఖీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement