ఐఐటీ మద్రాసులో ఆధ్యాత్మిక పరిశోధనా కేంద్రం | - | Sakshi
Sakshi News home page

ఐఐటీ మద్రాసులో ఆధ్యాత్మిక పరిశోధనా కేంద్రం

Mar 26 2026 11:41 AM | Updated on Mar 26 2026 11:41 AM

కొరుక్కుపేట: ఐఐటీ– మద్రాసు పూర్వ విద్యార్థి అయిన సంత్‌ రాజిందర్‌ సింగ్‌ జీ మహారాజ్‌ మద్దతుతో మానవ శ్రేయస్సును మెరుగుపరచడానికి ఆధ్యాత్మికత, ధ్యానం, విజ్ఞానశాస్త్రం, సమాజం మధ్య ఉన్న సంబంధాన్ని అన్వేషించడానికి ఐఐటీ మద్రాస్‌ ఆధ్యాత్మికత, విజ్ఞానశాస్త్రం సమాజంపై ఉన్నత పరిశోధనా కేంద్రాన్ని స్థాపించింది. దీని ప్రారంభోత్సవం సందర్బంగా ఈ కేంద్రం మానవ శ్రేయస్సు, చైతన్యంపై జరిగే ప్రపంచ పరిశోధనకు దోహదపడుతుందని ఐఐటీ మద్రాసు డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కామకోటి తెలిపారు. విజ్ఞానశాస్త్రం, మానవీయ శాస్త్రాలు, వైద్యం, వాస్తుశాస్త్రాలను మిళితం చేసే అంతర్విభాగ పరిశోధనను ప్రోత్సహిస్తుందని అంతేకాకుండా, ఈ కేంద్రం ధ్యానం, ఆధ్యాత్మికత శాసీ్త్రయ, సామాజిక ప్రభావాలను అధ్యయనం చేస్తుందన్నారు ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడైన, ఐఐటీ మద్రాస్‌ పూర్వ విద్యార్థి సంత్‌ రాజిందర్‌సింగ్‌ జీ మహారాజ్‌, ఐఐటీ మద్రాస్‌ క్యాంపస్‌లో ఈ కీలక కేంద్రాన్ని ప్రారంభించడానికి రూ. 5 కోట్లు విరాళంగా అందించారు. ఆయన 50 దేశాలలో 3,400కు పైగా కేంద్రాలు కలిగిన ఒక ప్రపంచ ఆధ్యాత్మిక సంస్థ అయిన సైన్స్‌ ఆఫ్‌ స్పిరిచ్యువాలిటీకి ఆధ్యాత్మిక అధిపతిగా ఉండటం విశేషం .

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement