కనీస వసతులు లేవని నిరసన | - | Sakshi
Sakshi News home page

కనీస వసతులు లేవని నిరసన

Mar 26 2026 11:41 AM | Updated on Mar 26 2026 11:41 AM

కనీస వసతులు లేవని నిరసన

వేలూరు: రాణిపేట జిల్లా వాలాజపేట మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో వందకు పైగా కుటుంబాలు నివశిస్తున్నాయి. అయితే ఈ ప్రాంతంలో అవసరమైన కనీస వసతులు కల్పించలేదు. బుధవారం ఉదయం ఆ వార్డులోని వారందరూ ఇంటిపై నల్ల జెండాలు కట్టి నల్ల దుస్తులు ధరించి తమకు కనీస వసతులు కల్పించాలని నిరసన తెలిపారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వసతులు కల్పించాలని లేకుంటే అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించి తమ ఓటరు కార్డు, ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డులను జిల్లా ఎన్నికల అధికారికి అప్పగించడంతో పాటు పోలింగ్‌ బూత్‌ వద్ద తమ ప్రాంత వాసులతో నిరసన తెలియజేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement