మునీశ్వరర్‌, పెరియాండవర్‌ మహాకుంభాభిషేకం | - | Sakshi
Sakshi News home page

మునీశ్వరర్‌, పెరియాండవర్‌ మహాకుంభాభిషేకం

Mar 26 2026 11:41 AM | Updated on Mar 26 2026 11:41 AM

పళ్ళిపట్టు: మునీశ్వరర్‌, పెరియాండవర్‌ ఆలయ మహాకుంభాభిషేకం బుధవారం కోలాహలంగా నిర్వహించారు. పళ్లిపట్టు సమీపంలోని సీఆర్‌.పట్టడ, కేశరాజుపురం గ్రామస్తులు సంయుక్తంగా గ్రామానికి శివారులోని కుశస్థలినది తీరంలో వినాయకుడి ఆలయంతో పాటు మునీశ్వరర్‌ ఆలయం, పెరియాండవర్‌ ఆలయాలు నూతనంగా నిర్మించారు. ఆలయ నిర్మాణపు పనులు పూర్తి కావడంతో సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజుల పాటు మహాకుంభాభిషేకం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో యాగశాలలు ఏర్పాటు చేసి నిత్యహామ పూజలు జరిగాయి. బుధవారం ఉదయం మహాపూర్ణాహుతి హామపూజలు అనంతరం అశేష భక్తజనం నడుమ మేళ తాళాలతో పవిత్ర పుణ్యతీర్ధాల కలశాలతో బయల్దేరి ముందుగా వినాయకుడి ఆలయ విమాన కలశానికి మహాకుంభాభిషేకం నిర్వహించారు. అనంతరం మునీశ్వరర్‌, పెరియాండవర్‌ విగ్రహాలకు మహా కుంభాభిషేకం నిర్వహించారు. భక్తులందరికీ ఆలయ నిర్వాహకులు కుంకుమ ప్రసాదాలు పంపిణీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement