సాక్షి, చైన్నె: ప్రముఖ క్రికెటర్ దినేష్‌కార్తీక్ ఐకానిక్ జెర్సీ నెంబర్ 19 ఆకారంలో నిలుచోని చైన్నెస్ అమృత విద్యార్థులు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ స్థానం సంపాధించి చరిత్ర సృష్టించారు. బుధవారం ఉదయం చైన్నెలోని నెహ్రూ స్టేడియం వేదికగా తమిళనాడు డాక్టర్ ఎం.జి.ఆర్ మెడికల్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ డాక్టర్ కె. నారాయణస్వామి, చైన్నెస్ అమృత గ్రూప్ ఛైర్మన్ ఆర్‌స్‌మినాథన్ సమక్షంలో ఈ సాథన జరిగింది. ఇందులో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాలలోని చైన్నెస్ అమృత విద్యా సంస్థల నుండి 3,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. క్రికెటర్ దినేష్ కార్తీక్‌పై అభిమానాన్ని చాటుకుంటూ, ఆయన ఐకానిక్ జెర్సీ నంబర్ 19కి ప్రతీకగా, వారంతా కలిసి సీఏ లవ్ డీకే 19 అనే భారీ ఆకారంలో నిలుచోని రికార్‌ుడ్సకు యత్నించారు. క్రీడాకారుడి జెర్సీకి మానవ ఆకారంలో గరిష్ట సంఖ్యలో పాల్గొన్నందుకు గాను దీనిని ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌గా స్థానం సంపాదించారు. చారిత్రాత్మక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత క్రికెటర్ దినేష్ కార్తీక్, గౌరవ అతిథిగా చైన్నెలోని తమిళనాడు డాక్టర్ ఎం.జి.ఆర్ మెడికల్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ కె. నారాయణస్వామి, ఎం.డి., డి.ఎం. (గ్యాస్ట్రో) హాజరయ్యారు. ఈ రికార్డు పట్టుదల, ధృఢ సంకల్పం, కఠోర శ్రమ వంటి విలువలను ప్రోత్సహించడం ద్వారా విద్యార్థులకు స్ఫూర్తినిచ్చింది. ఈ కార్యక్రమం చైన్నెస్ అమృత 7వ వార్షిక క్రీడా సమావేశానికి విద్యార్థులు క్రికెట్, వాలీబాల్, త్రోబాల్, ఫుట్‌బాల్, కబడ్డీ, అథ్లెటిక్స్ వంటి అనేక క్రీడాంశాలలో పోటీపడ్డారు. పోటీలలో విజేతలకు పతకాలు, ట్రోఫీలతో సత్కరించారు.


