169 స్థానాలలో అన్నాడీఎంకే పోటీ
ఎన్నికల ప్రచారానికి శ్రీకారం
23 మందితో తొలి జాబితా
16 మంది సిట్టింగ్‌లకు అవకాశం
సాక్షి, చైన్నె: మిత్రులకు సోమవారం సీట్ల సర్దుబాటును ముగించిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి మంగళవారం ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. బుధవారం మిత్రులందర్నీ ఎంజీఆర్ మాళిగైకు పిలిపించి, నియోజకవర్గాలను కేటాయించారు. బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, పీఎంకే నేత అన్బుమణి, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్, తమిళ మానిల కాంగ్రెస్ జీకే వాసన్, కేంద్ర సహాయ మంత్రి ఎల్. మురుగన్, మాజీ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ తదితరులతో కలిసి మిత్రులు ఎవ్వరెవ్వరికి ఏఏ నియోజకవర్గాలు కేటాయించడం జరిగిందో అన్న వివరాలను పళణి స్వామి ప్రకటించారు. అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమిలో బీజేపీ, పీఎంకే, అమ్మమక్కల్ మున్నేట్ర కళగం, తమిళ మానిల కాంగ్రెస్, ఐజేకే, టీఎంఎంకే, పురట్చి భారతం పార్టీలు ఉన్నట్టు వివరించారు. మిత్రులందరికీ నియోజకవర్గాలు కేటాయింపు ప్రక్రియ ముగియడంతో సుమారు 169 స్థానాలలో అన్నాడీఎంకే పోటీకి సిద్ధమైంది.
ప్రచారానికి శ్రీకారం
సీట్ల సర్దుబాటు, మేనిఫెస్టో విడుదల, మిత్రులకు నియోజవర్గాల కేటాయింపు ప్రక్రియను ముగించిన పళణిస్వామి బుధవారం సాయంత్రం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మైలాపూర్‌లోని కపాలీశ్వర ఆలయంలో విశిష్ట పూజల అనంతరం పళణిస్వామి ఎన్నికల ప్రచారంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.
మిత్రులకు నియోజకవర్గాల కేటాయింపు
1. బీజేపీ : బీజేపీకి కూటమిలో 27 సీట్లు కేటాయించారు. ఇందులో మైలాపూర్, తళి, మొడక్కురిచ్చి, ఉదగమండలం (ఊటీ), అవినాశి, తిరుపూర్ సౌత్, కోయంబత్తూర్ నార్త్, గందర్వకోట్టై, పుదుక్కోట్టై, తిరుపత్తూర్, మధురై సౌత్, సాత్తూరు, తిరుచెందూర్, వాసుదేవనల్లూర్, రాధాపురం, నాగర్‌కోయిల్, విలవన్‌కోడ్, ఆవడి, తిరువణ్ణామలై, తంజావూరు, తిరువారూర్, అరంతాంగి, మానామధురై, రామనాథపురం, కుళచల్, పద్మనాభపురం, రాశిపురం నియోజకవర్గాలు ఉన్నాయి.
2. పీఎంకే : కూటమిలో పీఎంకేకు 18 స్థానాలు కేటాయించారు. ఇందులో సేలం వెస్ట్, సేలం నార్త్, ధర్మపురి, పెన్నాగరం, విక్రవాండి, షోళింగర్, తిరుప్పోరూర్, ఉత్తరమేరూరు, జయంకొండం, విరుదాచలం, మైలాడుతురై, సెంజీ, పోలూరు, కీల్ వేలూరు, రిషివందియం, కాట్టుమన్నార్ కోయిల్, పెరంబూరు, అంబత్తూరు నియోజకవర్గాలు ఉన్నాయి.
3. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం: ఈ పార్టీకి 11 స్థానాలు కేటాయించారు. వీటిలో పెరియకుళం, మన్నార్గుడి, తిరువయ్యారు, కారైకుడి, తిరుపత్తూర్, నాంగునేరి, ఒట్టపిడారం, తిరుచ్చి వెస్ట్, సైదాపేట, పూందమల్లి, మడత్తుకుళం నియోజకవర్గాలు ఉన్నాయి.
4.తమిళ మానిల కాంగ్రెస్ : ఈపార్టీకి ఒట్టన్ ఛత్రం, ఈరోడ్ వెస్ట్, రాణిపేట, కిళ్ళియూరు, కుంభకోణం వంటి ఐదు నియోజకవర్గాలు అప్పగించారు.
5.ఐజేకే: పల్ల్లావరం, కున్నం
6.టీఎంఎంకే: రాజపాళయం నియోజకవర్గం కేటాయింపు( ఈ సీటు కోసం సినీ నటి గౌతమి ఎదురు చూడగా మిత్ర పక్షానికి అన్నాడీఎంకే కేటాయించడం ఆమెకునిరాశే)
7. పురట్చి భారతం: కేవీ కుప్పం నియోజకవర్గం.


