110 మందితో టీవీకే జాబితా | - | Sakshi
Sakshi News home page

110 మందితో టీవీకే జాబితా

Mar 26 2026 7:45 AM | Updated on Mar 26 2026 7:45 AM

– 28 నుంచి విజయ్‌ ప్రచారం

సాక్షి,చైన్నె : 110 మంది అభ్యర్థులతో టీవీకే అధినేత విజయ్‌ తొలి జాబితా సిద్ధం చేశారు. గురువారం పార్టీ వర్గాలతో సమావేశానంతరం శుక్రవారం ఈ జాబితాను ప్రకటించనున్నారు. శనివారం చైన్నె పెరంబూరు నుంచి ఎన్నికల ప్రచారానికి విజయ్‌ శ్రీకారం చుట్టనున్నారు. గత నాలుగైదు రోజులుగా విజయ్‌ అభ్యర్థుల ఎంపిక పై తీవ్ర పరిశీలన చేసినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తొలి విడతగా 110 స్థానాలలో అభ్యర్థులను ప్రకటించే విధంగా జాబితాను సిధ్దం చేసి, గురువారం జరిగే పార్టీ కార్యవర్గ సమావేశంలో చర్చించనున్నట్టు వివరించారు. శుక్రవారం తొలి జాబితా వెలువడుతుందని, శనివారం నుంచి ప్రచార బాటలో విజయ్‌ దూసుకెళ్లనన్నారని పార్టీ కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, విజయ్‌చైన్నెలోని పెరంబూరు నియోజకవర్గంలో పోటీ చేయనున్నట్టు, అందుకే ఆయన తన ప్రచారం అక్కడి నుంచి చేపట్టబోతున్నట్లు ఓ నేత పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement