తిరుత్తణి: తిరుత్తణి సమీపంలో వాహన తనిఖీల్లో ఆధారాలు లేకుండా తీసుకెళుతున్న రూ. 5.86 లక్షల నగదును ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో ఎన్నికల నియమావళి అమల్లో వుంది. దీంతో వాహన తనిఖీలు నిర్వహించి రికార్డులు లేకుండా తీసుకెళ్లే నగదు, వస్తువులను అధికారులు స్వాధీనం చేస్తుకుంటున్నారు. తనిఖీల్లో భాగంగా తిరుత్తణి సమీపంలోని చివాడ వద్ద మంగళవారం ఎన్నికల స్టాండింగ్ బృందం తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ఓ కారులో తనిఖీ చేశారు. తనిఖీల్లో ఎటువంటి ఆధారాలు లేకుండా తీసుకెళుతున్న రూ.5.86లక్షలు స్వాధీనం చేసుకొని తిరుత్తణి ఎన్నికల అధికారి ఆర్డీఓ కనిమొళికి అప్పగించారు. విచారణలో ఆంధ్రాలోని చిత్తూరు జిల్లా విజయపురం మండలం సూరికాపురానికి చెందిన గజేంద్ర అనే వ్యక్తి చివాడ పెట్రోల్ బంక్‌లో కారుకు డీజిల్ పట్టుకొని తిరుపతికి వెళ్లి ప్రయివేటు కంపెనీలో డబ్బులు చెల్లించేందుకు తీసుకెళ్లుతున్నట్లు తెలిపారు. ఆధారాలు సమర్పిస్తే నగదును తిరిగి ఇస్తామని అధికారులు తెలిపారు.


