తిరుత్తణిలో కావళ్ల సందడి | - | Sakshi
Sakshi News home page

తిరుత్తణిలో కావళ్ల సందడి

Mar 25 2026 7:21 AM | Updated on Mar 25 2026 7:21 AM

తిరుత్తణి: పంగుణి కత్తిక సందర్భంగా తిరుత్తణి ఆలయంలో కావళ్ల సందడి నెలకొంది. పంగుణి కత్తిక సందర్భంగా సోమవారం ఉదయం మూలవర్లకు సుగంధ ద్రవ్యాలతోపాటు పంచామృత అభిషేక పూజలు నిర్వహించారు. బంగారు కవచం అలంకరణ చేపట్టి మహాదీపారాధన పూజలు చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు పుష్ప కావళ్లతో కొండ ఆలయం చేరుకున్నారు. కొంతమంది భక్తులు శరీరానికి ఇనుప చువ్వలు గుచ్చుకుని, శూలం, పాదాలకు ఇనుప కడ్డీల పాదరక్షలతో కొండ ఆలయానికి నడిచి వెళ్లి పంబై, ఉడుకై ్క మేళ తాళాలతో మురుగన్‌ భక్తి పాటలు ఆలపిస్తూ సందడి చేశారు. అనంతరం మూడు గంటల పాటు వేచివుండి స్వామి దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం కొండ ఆలయ మాడ వీఽధిలో మజ్జిగ, తాగునీరు సరఫరా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement