తిరుత్తణి: తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆదివారం సెలవు దినం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. మూడు గంటల పాటూ భక్తులు క్యూలైన్‌లలో వేచివుండి స్వామివారి దర్శనం చేసుకున్నారు. అలాగే తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామికి ఆదివారం వేకువజామున పంచామృత అభిషేకం చేపట్టి బంగారు కవచం అలంకరణ చేపట్టి దీపారాధన నిర్వహించారు. వారాంతపు సెలవు దినం కావడంతో పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుత్తణికి చేరుకున్నారు. కొండ ఆలయంలో వాహన రద్దీని నియంత్రించే విధంగా వాహనాలకు ఘాట్‌రోడ్డులో అనుమతి రద్దు చేసి భక్తులు ఉచిత బస్సుల ద్వారా కొండ ఆలయానికి చేరుకునేందుకు ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఉచిత దర్శనం క్యూలైన్‌లలో మూడు గంటల పాటు వేచివుండి స్వామి దర్శనం చేసుకోగా, రూ. వంద ప్రత్యేక దర్శన మార్గంలో రెండు గంటల్లో భక్తులు స్వామి దర్శనం చేసి మొక్కులు చెల్లించారు.
కొండ ఆలయంలో భక్తుల రద్దీ
విశేష అలంకరణలో ఉత్సవర్లు సుబ్రహ్మణ్యస్వామి


