తమిళసినిమా: మిలియన్ డాలర్స్ స్టూడియోస్, నీయో కాస్టిల్స్ క్రియేషన్స్ సంస్థల అధినేతలు సత్య కరికాలన్, యువరాజ్ గణేశన్ కలిసి నిర్మిస్తున్న చిత్రం అన్బే డయానా. జమా చిత్రం ఫేమ్ పారి ఇళవళగన్ కథానాయకుడిగా నటిస్తూ, కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రంలో ఆయనకు జంటగా రమ్యా రంగనాథన్ నటిస్తున్నారు. తమిళనాడులోని ఒక సమాజం నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రంలోని యువతను అలరించే లోకల్ సంగీత బాణీలతో కూడిన సింగిల్ సాంగ్‌ను విడుదల చేసినట్లు యూనిట్ సభ్యులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పాటను ఇప్పుడు సంగీత ప్రిములు రీపీట్‌గా వింటున్నారన్నారు. రొమాంటిక్ వైబ్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టెయినర్‌గా సాగే అన్బే డయానా చిత్ర ఆడియో, ట్రైలర్ విడుదల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. నటుడు చేతన్, వైరల్ యూట్యూబర్ పరితాపంగల్ గోపి, ఇస్మత్ భాను, సుదర్శన్ గాంధీ, సెల్ మురుగన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి భరత్ శంకర్ సంగీతాన్ని, షెల్లి గెలిస్ట్ ఛాయాగ్రహణంను అందిస్తున్నారు.
పెళ్లితో పనేంటి?
తమిళసినిమా: పెళ్లి అనే పదానికి అర్థమే మారిపోతున్న రోజులివి. పెళ్లి అనేది ఒక తంతు మాత్రమే అంటున్నారు కొందరు. చాలా మంది సహజీవనమే మేలు అంటున్నారు. ఈ కోవకు చెందిన నటి ఐశ్వర్యలక్ష్మి. నటి, నిర్మాత అయిన ఈ మలయాళల బ్యూటీ కోలీవుడ్‌లోనూ పొన్నియిన్ సెల్వన్, కట్టాకుస్తీ, జగమేతంతిరమ్, పుత్తం పుదుకాళై, మామన్ వంటి కొన్ని సక్సెస్‌ఫుల్ చిత్రాల్లో నటించారు. ఈ 34 ఏళ్ల పరువాల భామ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ తనకు పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదన్నారు. తన దృష్టిలో బంధం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య అవగాహన, అర్థం, నమ్మకంపై ఆధారపడి ఉంటుందన్నారు. ఎలాంటి బంధం అయినా ఒకరిపై ఒకరు ఇచ్చి పుచ్చుకునే గౌరవ మర్యాదలపై ఆధారపడి ఉంటుందన్నారు. చట్టబద్ధంగా చేసుకునే పెళ్లే బలమైనది అని చెప్పడం కరెక్ట్ కాదన్నారు. కొందరు పెళ్లి చేసుకోకుండానే సంతోషంగా ఉంటున్నారన్నారు. తన 34 ఏళ్ల జీవితంలో పలు పెళ్లిళ్లను, కొందరు మనుషులను చూశానన్నారు. వారిలో సంతోషంగా ఉన్న దంపతులు చాలా తక్కువే అని అన్నారు. పెళ్లి అనేది తప్పనో, అనవసరమనో తాను చెప్పడం లేదని, అది వ్యక్తిగత విషయం అని అన్నారు. కొందరు పెళ్లి రక్షణ అని, సమాజంలో గుర్తింపు అని భావిస్తారన్నారు. జీవితానికి తోడు అవసరమేనని, అయితే దానితో మనశ్శాంతి లేకుండా ఉండే పరిస్థితి రాకూడదని అన్నారు. కాబట్టి పెళ్లి చేసుకోకుండా సహజీవనం విధానమే మంచిదన్నది తన భావన అన్నారు. ఇది ప్రేమకు వ్యతిరేకం కాదని, పెళ్లి పేరుతో సమాజంలోని విధానాన్ని తాను అంగీకరించలేనని అన్నారు. అసలు పెళ్లితో పనేంటి అనే విధంగా పేర్కొన్నారు. ఈమె వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ప్రస్తుతం ఈ అమ్మడు తమిళంలో గట్లాకుస్తీ–2 చిత్రంలో నటిస్తున్నారు.
ఐశ్వర్యలక్ష్మి


