రాజశేఖర్ తాడేపల్లి
కొరుక్కుపేట: పరాభవ నామ సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆర్యవైశ్య అఫిషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఆవోపా) తమిళనాడు అధ్యక్షుడు రాజశేఖర్ తాడేపల్లి అన్నారు. చైన్నె గోపాలపురంలోని మ్యారీస్ హాలు వేదికగా ఆదివారం అవోపా సంస్థ ఆధ్వర్యంలో పరాభవ నామసంవత్సర ఉగాది–2026 వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ అధ్యక్షులు తంగుటూరి రామకృష్ణ, ఊరా గ్రూప్ అధినేత ఊరా లక్ష్మీ నరసింహారావు, ఆడిటర్ దివ్యా అభిషేక్, న్యాయవాది సంజయ్ రామస్వామి, విద్యావేత్త రావణన్‌కు ఉగాది పురస్కారాలను ప్రదానం చేశారు . ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ పరాభవసంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని అన్నారు . తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన ఉగాది పర్వదినం సందర్భంగా వివిధ రంగాల్లో నిష్నాతులైన ఐదుగురిని ఉగాది పురస్కారాలతో సత్కరించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు . తమ కుటుంబం సభ్యులు, శ్రేయోభిలాషుల సహకారంతో ఈ వైభవాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు రాజశేఖర్ తెలిపారు. బాలా త్రిపురసుందరి నేతృత్వంలో కళాక్షేత్ర విద్యార్థులు భరతనాట్యం ప్రదర్శించి అందరిని ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో కార్యదర్శి రంగనాథం శెట్టి,కోశాధికారి టిజి శేఖర్ జాయింట్ సెక్రటరీ ఏ సుధాకర్, ఆర్యవైశ్య ప్రముఖులు అజంతా కె. శంకరరావు , కనిగెలుపుల రాథాకృష్ణ , వీఎన్ హరినాథ్ , కెఎన్ సురేష్‌బాబు, జయశ్రీ ,టిజీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


