జాలియా ఇరుంద ఒరుత్తన్‌ చిత్ర షూటింగ్‌ పూర్తి | - | Sakshi
Sakshi News home page

జాలియా ఇరుంద ఒరుత్తన్‌ చిత్ర షూటింగ్‌ పూర్తి

Mar 23 2026 8:34 AM | Updated on Mar 23 2026 8:34 AM

తమిళసినిమా: ఇటీవల తలైవర్‌ తంబి తలమైయిల్‌ చిత్రంతో పుల్‌ఫామ్‌లోకి వచ్చిన నటుడు జీవా. ఈయన తాజాగా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం జాలియా ఇరుంద ఒరుత్తన్‌.ఈ చిత్రానికి రాజేశ్‌.ఎం కథ, కథనం,దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. మాలిక్‌ స్ట్రీమ్స్‌ కార్పోరేషన్‌ పతాకంపై మలేషియాకు చెందిన దత్తో అబ్దుల్‌ మాలిక్‌ నిర్మిస్తున్న ఇందులో నటి ఇవనా నాయకిగా నటిస్తున్నారు. పరితాపంగల్‌ సుధాకర్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుందని యూనిట్‌ సభ్యులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. చిత్ర వివరాలను తెలుపుతూ గత 16 ఏళ్ల క్రితం జీవా,దర్శకుడు రాజేశ్‌.ఎం కాంబోలో రూపొంది విజయం సాధించిన శివ మనసుల శక్తి చిత్రం తరువాత తెరకెక్కుతున్న చిత్రం కావడంతో జాలియా ఇరుంద ఒరుత్తన్‌ చిత్రంపై ప్రేక్షకుల మధ్య మంచి అంశనాలు నెలకున్నాయన్నారు. అదేవిధంగా ఇటీవల విడుదల చేసిన చిత్ర ప్రొమో వీడియోకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. కాగా పక్కా మాస్‌ ఎంటర్‌టెయినర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రం జనరంజకంగా ఉంటుందన్నారు. కాగా చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోందని తెలిపారు. దీనికి యువన్‌శంకర్‌రాజా సంగీతాన్ని, ఎం.సుకుమార్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు.

ఈ తరం

ప్రేమకథా చిత్రంగా

లవ్‌ 3.ఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement