భూగర్భ డ్రైనేజీ పనులు వేగవంతం
వేలూరు: వేలూరు కార్పొరేషన్ పరిఽధిలో జరుగుతున్న భూగర్బ డ్రైనేజీ పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం కార్పొరేషన్ పరిధిలోని వసంతపురంలో జరుగుతున్న డ్రైనేజీ పనులను ఆమె తనిఖీ చేశారు. పనులు నత్త నడకన జరుగుతున్నందున వేగవంతం చేసి పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల్లో నాశిరకంగా ఉంటే చర్యలు తప్పవన్నారు. అదే విధంగా కార్పొరేషన్‌లో అన్ని ప్రాంతాల్లోనూ భూగర్భ డ్రైనేజీ పైప్‌లైన్‌లు ఏర్పాటు చేశామని, వాటిని సక్రమంగా ట్రయిల్ రన్ చేయాలన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో పెట్టాలన్నారు. అనంతరం పనులను ఆమె తనిఖీ చేసి పరిశీలించారు. కలెక్టర్‌తోపాటు కార్పొరేషన్ కమిషనర్ లక్ష్మణ్, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.


