ఈ విజయం ఆయనకే..! | - | Sakshi
Sakshi News home page

ఈ విజయం ఆయనకే..!

Feb 2 2026 8:05 AM | Updated on Feb 2 2026 8:05 AM

ఈ విజ

ఈ విజయం ఆయనకే..!

తమిళసినిమా: సౌందర్య రజనీకాంత్‌కు చెందిన జియోన్‌ ఫిలింస్‌, ఎంఆర్‌పీ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ సంస్థ అదినేతలు పసిలియాన్‌ నజిరేద్‌, మహేశ్‌రాజ్‌ పసిలియాన్‌ కలసి నిర్మించిన చిత్రం విత్‌ లవ్‌. టూరిస్ట్‌ ఫ్యామిలీ చిత్ర దర్శకుడు అభిషన్‌ జీవింత్‌ కథానాయకుడిగా పరిచయమైన ఇందులో అనస్వరరాజన్‌ నాయకిగా నటించారు. టూరిస్ట్‌ ఫ్యామిలీ చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేసిన మదన్‌ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈచిత్రం ఈనెల 5న తెరపైకి రానుంది. శనివారం సాయంత్రం చైన్నెలోని ఒక నక్షత్ర హోటల్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ కార్యక్రమంలో అభిషన్‌ జీవింత్‌ మాట్లాడుతూ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తనను ఆయన ఇంటికి పిలిపించి నువ్వు నటించు కన్నా అని చెప్పారన్నారు. అందుకే ఈ చిత్రం సాధించే విజయాన్ని ఆయనకే సమర్పించనున్నట్లు చెప్పారు. సౌందర్య రజనీకాంత్‌ మాట్లాడుతూ గోవా చిత్రం ద్వారా తాను నిర్మాతగా మారి 16 ఏళ్లు అయ్యిందన్నారు. మరో నిర్మాత మహేశ్‌రాజ్‌ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. చిత్ర దర్శకుడు మదన్‌ మాట్లాడుతూ ఈ చిత్రంలో అభిశషన్‌ జీవింద్‌ మాట్లాడుతూ సౌందర్య రజనీకాంత్‌ను కలసి కథ చెప్పగా వెంటనే ఆమె చిత్రం చేద్దాం అని చెప్పారన్నారు. అలా విత్‌ లవ్‌ చిత్రం ప్రారంభమైందని చెప్పారు.

ఈ విజయం ఆయనకే..! 1
1/1

ఈ విజయం ఆయనకే..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement