నియోజకవర్గ బాటకు డీఎంకే శ్రీకారం | - | Sakshi
Sakshi News home page

నియోజకవర్గ బాటకు డీఎంకే శ్రీకారం

Feb 2 2026 7:47 AM | Updated on Feb 2 2026 7:47 AM

నియోజకవర్గ బాటకు డీఎంకే శ్రీకారం

నియోజకవర్గ బాటకు డీఎంకే శ్రీకారం

● రెండ్రోజుల్లో సీట్ల పంపకాలపై దృష్టి

సాక్షి, చైన్నె : మళ్లీ అధికారమే లక్ష్యంగా ప్రజలలోకి చొచ్చుకెళ్లేందుకు డీఎంకే నియోజకవర్గ బాటకు శ్రీకారం చుట్టింది. ముఖ్య నేతలు ఆదివారం నుంచి ఆయా నియోజకవర్గాలలో తిష్ట వేసి రోజుకో ప్రాంతంలో సభలను నిర్వహించే పనిలో నిమగ్నమయ్యారు. మళ్లీ అధికారంలో లక్ష్యంగా సీఎం స్టాలిన్‌ వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. ద్రావిడ మోడల్‌ 2.ఓ ప్రభుత్వ తథ్యమన్న ధీమాను అన్ని వేదికలలో స్పష్టం చేస్తూ వస్తున్నారు. అదే సమయంలో పార్టీ తరపున ప్రజలలోచొచ్చుకెళ్లే కార్యక్రమాలను విస్తృతం చేయిస్తున్నారు. ఇప్పటికే బూత్‌ల స్థాయిలో ఇంటింటా ప్రచార పయనంలో కేడర్‌ నిమగ్నమై ఉన్నారు. జిల్లా స్థాయిలో సభలు, డివిజన్ల స్థాయిలో మహానాడులు విస్తృతం చేశారు. తాజాగా దివారం నుంచి నియోజకవర్గ బాటకు శ్రీకారం చుట్టారు.. ఆయా నియోజక వర్గాలలలోని నేతల ద్వారా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రోజు సభలు, సమావేశాలు నిర్వహించే విధంగా కార్యాచరణతో ముందుకెళ్తున్నారు.ఈ సభల కోసం ఇప్పటికే స్టార్‌ వ్యాఖ్యాతలను సిద్ధం చేసినవ ఇషయం తెలిసిందే. జిల్లాల కార్యదర్శులు, ఇన్‌చార్జ్‌లు, నియోజకవవర్గ ఎమ్మెల్యేలు, మంత్రులు, మండల, డివిజన్‌ ప్రతినిధులు ఇక నియోజకవర్గాలలోనే ఉండే విధంగా డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ ఆదేశించారు.

ఇక సీట్ల చర్చలు..

డీఎంకే కూటమిలోని పార్టీలతో సీట్ల చర్చలకు స్లాలిన్‌ సన్నద్ధమవుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీ రెండు మూడు రోజులలో రంగంలోకి దిగనుంది. తొలుత టీఎన్‌సీసీ నేతలతో చర్చలు ఈ కమిటీ జరపనున్నది. చర్చల తదుపరి సీట్ల పందేరానికి సంబంధించిన ఒప్పందాల దిశగా ముందుకు సాగబోతున్నారు. ఈ విషయంపై టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై స్పందిస్తూ, డీఎంకే నుంచి రెండు రోజులలో తమకు ఆహ్వానం వస్తుందని భావిస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ గిరిశ్‌ సోదన్కర్‌ పేర్కొంటూ డీఎంకేతో చర్చలు జరుగుతున్నాయని పేర్కొంటూనే, తమకు టీవీకే విజయ్‌ నుంచి ఆహ్వానం వచ్చినట్టు పరోక్షంగా స్పందించడం గమనార్హం. ఇక, ఈ కూటమిలోని ఎండీఎంకేకు ఆరు స్థానాలు ఇవ్వడానికి డీఎంకే నిర్ణయించినట్టు సమాచారం. ఇందులో మూడు స్థానాలు డీఎంకే చిహ్నం ఉదయ సూర్యుడిపై ఆ పార్టీ సూచించే అభ్యర్థులు పోటీ చేయాలన్న మెలిక పెట్టనున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇక ప్రస్తుతానికి ఎవరితోపొత్తు అన్నది సస్పెన్షన్‌లో పెట్టిన ప్రేమలత విజయకాంత్‌ నేతృత్వంలోని డీఎండీకే సైతం డీఎంకేతో రహస్య చర్చలు జరుపుతుందనే సమాచారం ఆదివారం వెలుగులోకి వచ్చాయి. డీఎండీకేకు ఆరు స్థానాలు, ఓ రాజ్యసభ సీటు ఇవ్వడానికి డీఎంకే సిద్ధంగా ఉన్నట్టు చర్చ జరుగుతోండడం గమనార్హం. అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement