ఉన్నత విద్యపై ఆసక్తి చూపాలి | - | Sakshi
Sakshi News home page

ఉన్నత విద్యపై ఆసక్తి చూపాలి

Feb 1 2026 3:37 AM | Updated on Feb 1 2026 3:37 AM

ఉన్నత విద్యపై ఆసక్తి చూపాలి

ఉన్నత విద్యపై ఆసక్తి చూపాలి

వేలూరు: బాలికలు ఉన్నత విద్యపై ఆసక్తి చూపి పరిశోధనలు చేసి దేశాభివృద్ధికి పాటు పడాలని తిరువళ్లువర్‌ యూనివర్సిటీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ బాబు జనార్దన్‌ అన్నారు. వేలూరు ధనభాగ్యం క్రిష్ణస్వామి మొదలియార్‌ మహిళా డిగ్రీ కళాశాలలో 51వ స్నాతకోత్సవ కార్యక్రమం కళాశాల కార్యదర్శి మణినాథన్‌ అద్యక్షతన శనివారం జరిగింది. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని, అందుకు కారణం విద్య ఒక్కటే అన్నారు. అధికంగా మహిళలు ప్లస్‌టూ, డిగ్రీ వరకు విద్యను అభ్యసించి ఉన్నత విద్యకు దూరమవుతున్నారన్నారు. అలా కాకుండా పట్టుదలతో ఉన్నత విద్య చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారన్నారు. చిన్నప్పటి నుంచే ప్రతి ఒక్కరికీ లక్ష్యం ఉండాలని సూచించారు. ఇంటర్నెట్‌, వాట్సాప్‌లను పక్కన పెట్టి విద్యా సంబందమైన పరిశోధనలు చేసేందుకు ఆసక్తి చూపాలన్నారు. అనంతరం యుజి, పీజి కోర్సులో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినులకు డిగ్రీ పట్టాలను అందజేశారు. కళాశాల చైర్మన్‌ శివకుమార్‌, ప్రిన్సిపల్‌ భానుమతి, విద్యార్థినులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement