కాంగ్రెస్ శ్రేణుల ధర్నా
తిరువళ్లూరు: ఉపాధి హామీ పేరును మార్చడంతోపాటు పనులు ఎక్కడ చేయాలో గ్రామసభలో నిర్ణయించే అధికారాన్ని తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం పేరంబాక్కంలో ధర్నా నిర్వహించారు. ధర్నాకు పార్టీ మండల అధ్యక్షుడు సతీష్, డీసీసీ అధ్యక్షుడు శశికుమార్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం పేరును మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం సరికాదన్నారు. గతంలో ఉపాధి పనులను ఎక్కడ నిర్వాహించాలనే విషయాన్ని గ్రామసభలో నిర్ణయించి పనులు చేపట్టే వారన్నారు. అయితే ప్రస్తుతం గ్రామసభకు సంబంధం లేకుండా పనుల ఎంపిక విధానానికి శ్రీకారం చుట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దశల వారిగా ఉపాధి పథకాన్ని ఎత్తివేయాలని బీజేపీ ప్రభుత్వం చూస్తుందని ఆయన ఆరోపించారు. నిరుపేదలకు వెన్నుముకగా వున్న ఉపాధి పథకంలో మార్పులు, చేర్పులను సహించబోమన్న ఆయన బీజేపీ వ్యవహరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ఉమ్మడి పోరాటం చేస్తామన్నారు. ధర్నాలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దివాకర్ పాల్గొన్నారు.


