అత్తిమాంజేరిపేటలో వైద్యశిబిరం
పళ్లిపట్టు: అత్తిమాంజేరిపేటలో గురువారం నిర్వహించిన వైద్య శిబిరంలో వెయ్యికి పైగా ప్రజలు పాల్గొని చికిత్స పొందారు. పళ్లిపట్టు సమీపంలోని అత్తిమాంజేరిపేటలో ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలో ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్టాలిన్ వైద్య శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. మండల వైద్యధికారి డాక్టర్ ధనుంజయన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరంలో మండల వ్యాప్తంగా నుంచి మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లలు, గర్భిణులు పాల్గొన్నారు. తిరువళ్లూరు, తిరుత్తణి ప్రభుత్వాసుపత్రుల నుంచి వైద్యుల బృందం పాల్గొని, ప్రజలకు చికిత్స చేశారు. శిబిరంలో పళ్లిపట్టు సెంట్రల్ మండల డీఎంకే కార్యదర్శి బీడీ చంద్రన్ పాల్గొని, గర్భిణులకు పౌష్టికాహార కిట్స్ పంపిణీ చేశారు.


