తిరుత్తణి ఆలయ హుండీ లెక్కింపు | - | Sakshi
Sakshi News home page

తిరుత్తణి ఆలయ హుండీ లెక్కింపు

Jan 31 2026 6:50 AM | Updated on Jan 31 2026 6:50 AM

తిరుత

తిరుత్తణి ఆలయ హుండీ లెక్కింపు

తిరుత్తణి: తిరుత్తణి శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో భక్తులు కానుకల రూపంలో రూ.1.25 కోట్లు చెల్లించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. తిరుత్తణిలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి ప్రతిరోజూ వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తులు స్వామి దర్శనం చేసుకుని తమ మొక్కులు చెల్లించే విధంగా హుండీల్లో నగలు, నగదు కానుకగా చెల్లించడం పరిపాటి. ఆ ప్రకారం చివరి 24 రోజుల్లో భక్తులు హుండీల్లో చెల్లించిన కానుకలను గురువారం ఉదయం కొండ ఆలయంలోని వసంత మండపంలో నిర్వహించారు. ఆలయ జాయింట్‌ కమిషనర్‌ రమణి ఆధ్వర్యంలో ఆలయ సిబ్బందితోపాటు తాత్కాలిక సిబ్బంది వంద మందితో కానుకలు లెక్కింపు చేపట్టారు. రాత్రి ఎనిమిది గంటల వరకు నిర్వహించిన కానుకల లెక్కింపులో నగదుగా ఒక కోటి 25 లక్షల 86 వేల 026 రూపాయలు, 351 గ్రాముల బంగారం, 4700 గ్రాముల వెండి భక్తులు కానకగా చెల్లించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

సుబ్రహ్మణ్యస్వామి చిద్విలాసం

తిరుత్తణి పరిసర ప్రాంతాల్లోని ఐదు గ్రామాల్లో సుబ్రహ్మణ్యస్వామి ఏడాదిలో ఒక్కరోజు విహరించి భక్తుల కు కటాక్షించడం పరిపాటి. శనివారం స్వా మి విశేష అలంకరణలో వాహన సేవలో కొలువుదీరి పట్టణ వీధులు ద్వారా ధరణివరాహపురం చేరుకున్నారు. స్వామివారు రాక సందర్భంగా విద్యుద్దీపాలతో స ర్వాంగసుందరంగా అలంకరించారు. సాయంత్రం స్వామికి పూజలు నిర్వహించి రాత్రి స్వామి గ్రామ వీధుల్లో విహరించి భక్తులకు కనువిందు చేశారు.

కానుకలు లెక్కిస్తున్న ఆలయ సిబ్బంది, ధరణివరాహపురంలో విహరిస్తున్న సుబ్రహ్మణ్యస్వామి

తిరుత్తణి ఆలయ హుండీ లెక్కింపు1
1/1

తిరుత్తణి ఆలయ హుండీ లెక్కింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement