ఉపాధి పనులకు రూ.700 చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధి పనులకు రూ.700 చెల్లించాలి

Jan 30 2026 6:57 AM | Updated on Jan 30 2026 6:57 AM

ఉపాధి పనులకు రూ.700 చెల్లించాలి

ఉపాధి పనులకు రూ.700 చెల్లించాలి

తిరువళ్లూరు: ఉపాఽధీ హమీ పథకం కింద పని దినాలను రెండు వందల రోజులకు పెంచడంతో పాటు దినసరి కూలి రూ.700 చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గోపాల్‌ డిమాండ్‌ చేశారు. దేశంలోని వేర్వేరు సమస్యలపై అఖిల భారత బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. బంద్‌కు మద్దతు కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీలకు చెందిన నేతలు కార్యకర్తలు విసృతంగా ప్రచారం నిర్వహించి మద్దతు కోరుతున్నారు. ఇందులో భాగంగానే మ్మిడిపూండిలో ఉపాధి కూలీలను కలసిన సీపీఎం నేతలు భారత్‌ బంద్‌కు మద్దతు ఇవ్వడంతో పాటు ఆందోళనలో పాల్గొనాలని జిల్లా కార్యదర్శి గోపాల్‌ మహిళలను కోరారు. అనంతరం కరపత్రాలను పంపిణీ చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement